Site icon HashtagU Telugu

Vote For Pawan Kalyan : మీ భవిష్యత్ కోసం పాటు పడే పవన్ కల్యాణ్ ను గెలిపించండి – రామ్ చరణ్

Charanpawan

Charanpawan

మీ భవిష్యత్ కోసం పాటు పడే నాయకుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గారిని గెలిపించండి అంటూ రామ్ చరణ్ పిఠాపురం (Pithapuram) ప్రజలను కోరారు. ఏపీలో ఐదు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికలు ఓ లెక్క ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో లెక్కగా మారింది. ముఖ్యంగా పిఠాపురం నియోజవర్గం గురించి దేశ ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు , సినీ ప్రేక్షకులు సైతం మాట్లాడుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిల్చున్నారు.

గత ఎన్నికలలో పవన్ గాజువాక ,భీమవరం రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ఆ టైం పవన్ కళ్యాణ్ కు సినీ ఇండస్ట్రీ నుండి పెద్దగా ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ వెంట ఉండే వ్యక్తులు కూడా జగన్ కు జై కొట్టారు. కానీ ఇప్పుడు ఆలా కాదు యావత్ ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ గెలుపు కోరుకుంటుంది. కొంతమంది నేరుగా ప్రచారం చేస్తుండగా..మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొద్ది మాత్రం మాత్రం వెనుకనుండి సపోర్ట్ చేస్తున్నారు. ఇటు మెగా ఫ్యామిలీ హీరోలు సైతం ఇప్పటికే ప్రచారంలో పాల్గొనగా..ఈరోజు అన్నయ్య చిరంజీవి పిఠాపురం ప్రజలకు వీడియో సందేశం పంపించారు. తన తమ్ముడ్ని గెలిపించాలని , అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వారి వల్ల ప్రజాస్వామానికి మరింత నష్టం అని నమ్మి జనం కోసం జనసైనికుడు అయ్యాడు. తను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశాలి పవన్. ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే… చట్టసభల్లో అతని గొంతును మనం వినాలి.

We’re now on WhatsApp. Click to Join.

జనమే జయం అని నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలి అంటే మీరు పిఠాపురం ప్రజలు కల్యాణ్‌ గెలిపించాలి. మీకు సేవకుడిగా ,సైనికుడిగా అండగా నిలబడతాడు. మీకు ఏమైనా సరే కాపాడతాడు. మీ కలలను నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం గాజు గ్లాసు గుర్తుకు మీ ఓటు వేసి పవన్ కల్యాణ్‌ను గెలిపించండి. ” అని తన వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో చిరంజీవి పోస్టు చేశారు. ఈ పోస్ట్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) షేర్ చేసారు. మీ భవిష్యత్ కోసం పాటు పడే నాయకుడు పవన్ కల్యాణ్ గారిని గెలిపించండి అని పిలుపునిచ్చారు. తాను జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నానని రామ్ చరణ్ తెలిపారు.

Read Also : Weather : ఒక్కసారిగా చల్లబడ్డ తెలంగాణ..హమ్మయ్య అంటున్న ప్రజలు