Site icon HashtagU Telugu

Ram Charan : పిఠాపురంలో పవన్ ఇంటికి చేరుకున్న చరణ్..

Charan Pithapuram

Charan Pithapuram

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)..కొద్దీ సేపటి క్రితం పిఠాపురం (Pithapuram)లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇంటికి చేరుకున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుండి నేరుగా రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న చరణ్..రాజమండ్రి నుండి రోడ్డు మార్గాన పిఠాపురానికి చేరుకున్నారు. పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి వారిని చరణ్ దర్శించుకోనున్నారు. అనంతరం చేబ్రోలులోని పవన్ నివాసానికి చేరుకున్నారు. చరణ్ వెంట పెద్ద ఎత్తున అభిమానులు , పార్టీ శ్రేణులు తరలివచ్చారు. రామ్ చరణ్, పవన్ ఇద్దరూ ఇంటి బాల్కనీ నుంచి అభిమానులకు అభివాదం చేశారు . దీనికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

మరోపక్క అల్లు అర్జున్ నంద్యాల YCP మ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి కు మద్దతు తెలిపారు. స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి తన మద్దతును తెలియజేసారు. తనకు మంచి స్నేహితుడని అల్లు అర్జున్ తెలిపారు. ‘రవి పాలిటిక్స్ లోకి రాకముందు వారానికోసారి కలిసే వాళ్లం. కానీ ఐదేళ్లుగా ఆరు నెలలకోసారే కలుస్తున్నాం. ప్రజల కోసం కష్టపడుతున్న మనిషికి అండగా నిలవడానికి ఇక్కడకు వచ్చా. ఆయన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భవిష్యత్తులో మరిన్ని మెట్లు ఎక్కాలని ఆకాంక్షిస్తున్నా’ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. అయితే అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్ధికి మద్దతు తెలుపడం పట్ల మెగా అభిమానులు , జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత కుటుంబ సభ్యుడికి ట్వీట్ చేస్తాడు..ప్రత్యర్థి పార్టీ అభ్యర్ధికి నేరుగా ఇంటికి వెళ్లి మద్దతు తెలుపుతాడా..? అని వారంతా ప్రశ్నింస్తున్నారు.

Read Also : Arvind Kejriwal : దేశం కోసం 100 సీఎం పోస్టులనైనా వదిలేస్తా : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్