Ram Charan Tears: స్టేజ్ పై దృశ్యాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న రామ్ చరణ్

ఒకవైపు ప్రధాని, మరోవైపు సీఎం, అందులో బాబాయ్ మంత్రిగా ఉండటం, ఇక మోడీ మెగా బ్రదర్స్ ని ఏకం చేయడం చూసి చెర్రీ ఎమోషనల్ కు గురయ్యాడు.

Ram Charan Tears: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆయన నాలుగోసారి సీఎం అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ తదితరులతో సహా పలువురు బీజేపీ అగ్రనేతలు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో సహా 24 మంది ఎమ్మెల్యేలు ఈరోజు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 17 మంది మంత్రులు కొత్తవారే కావడం విశేషం. చంద్రబాబు మంత్రివర్గంలో ముగ్గురు మహిళలు, ఎనిమిది మంది వెనుకబడిన తరగతుల నాయకులు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఒక ముస్లిం ఉన్నారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్స్ పైనే అందరి చూపు. అయితే మెగా బ్రదర్స్ ని ఏకం చేస్తూ ప్రధాని మోడీ చేసిన పనికి ప్రతి కూటమి కార్యకర్త సంతోషానికి అవుదుల్లేకుండాపోయింది. ముఖ్యంగా మెగా కుటుంబం చాలా సంబరపడిపోయింది.

చంద్రబాబు సీఎంగా తన ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, కొత్త మంత్రులు కలిసి ఫోటో దిగారు. అయితే మోదీ దిగిపోయే సమయంలో పవన్‌ కళ్యాణ్‌ చేయి పట్టుకుని చిరంజీవి దగ్గరకు వెళ్లారు. ఓవైపు చిరంజీవి.. మరో వైపు పవన్ కళ్యాణ్.. ఉండగా మధ్యలో మోదీ నిల్చుకుని చేతులు పైకెత్తి అందరికీ అభివాదం చేశారు. ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. మెగస్టార్ కుటుంబ సభ్యులంతా ఈ దృశ్యాన్ని చూసి ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్ భావోద్వేగానికి గురయ్యాడు. ఒకవైపు ప్రధాని, మరోవైపు సీఎం, అందులో బాబాయ్ మంత్రిగా ఉండటం, ఇక మోడీ మెగా బ్రదర్స్ ని ఏకం చేయడం చూసి చెర్రీ ఎమోషనల్ కు గురయ్యాడు.

Also Read: Sleeping Disorder: ఇదేం వ్యాధి..? నిద్రలోనే రూ. 3 లక్షలకు పైగా ఖర్చు..!