Chiru Nagababu: ‌ మెగా బ్రదర్స్‌కు రాజ్యసభ..! మోడీ ప్లాన్ అదేనా?

పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కూడా.. ఆఫర్ వచ్చిందట. రాజ్యసభకు నాగబాబును పంపించేందుకు ఎన్డీఏ కూటమి నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మొన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా నాగబాబును నియామకం చేస్తారని వార్తలు వచ్చాయి.

Published By: HashtagU Telugu Desk
Chiranjeevi Nagababu

Chiranjeevi Nagababu

Chiru Nagababu: ఏపీలో  జనసేన (Jansena) పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. వందకు వందశాతం ఎమ్మెల్యేలను గెలిపించుకొని… రికార్డు సృష్టించింది జనసేన పార్టీ. తెలుగుదేశం (Telugudesham Party) కూటమి అధికారంలోకి రావడంలో కూడా జనసేన పార్టీ కీలక పాత్ర పోషించింది. దీంతో ఏపీలో ఏర్పాటు అయిన కొత్త ప్రభుత్వంలో కూడా జనసేన అధినేతకు సహా…. నాయకులకు కీలక మంత్రి (Ministry) పదవులే  దక్కాయి.

ముఖ్యంగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు… డిప్యూటీ సీఎం (Deputy Cm) సహా పంచాయితీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్  సహా మరో మూడు శాఖలు ఇచ్చారు.  అయితే జనసేన పార్టీలో మొదటి నుంచి కీలకంగా ఉన్న… పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు (Nagababu) కూడా.. ఆఫర్ వచ్చిందట. రాజ్యసభకు (Rajyasabha) నాగబాబును పంపించేందుకు ఎన్డీఏ (NDA) కూటమి నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మొన్నటి వరకు టీటీడీ చైర్మన్ (TTD Chairman) గా నాగబాబును నియామకం చేస్తారని వార్తలు వచ్చాయి.

కానీ నాగబాబు (Nagababu) దానికి సుముఖత వ్యక్తం చేయలేదట. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరఫున రాజ్యసభకు (Rajyasabha) మెగా బ్రదర్ నాగబాబును పంపించాలని అనుకుంటున్నారట. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో… దేశవ్యాప్తంగా మొత్తం ఎనిమిది రాజ్యసభ సభ్యులు లోక్సభ (Loksabha) ఎంపీలుగా గెలిచారు. ఈ నేపథ్యంలో… 8 మంది సభ్యులందరూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారు. ఇక అస్సాం (Assam) నుంచి ఎన్డీఏ కు చెందిన… కామాఖ్య ప్రసాద్ (Kamakhya Prasad) అలాగే సర్వానంద్ సోనీ వల్ ఇద్దరు కూడా రాజీనామా (Resign) చేస్తారు. ఈ నేపథ్యంలో అక్కడ జనసేన నేత నాగబాబును (Nominate Rajyasabha) రాజ్యసభకు పంపించాలని ఎన్డీఏ కూటమి నిర్ణయం తీసుకుందని సమాచారం అందుతోంది.

జాతీయస్థాయిలో జనసేన పార్టీకి (Janasena Party)… ప్రాధాన్యత కల్పించాలనే నేపథ్యంలో… ప్రధాని నరేంద్ర మోడీ ఆదిశగా అడుగులు వేస్తున్నారట. నాగబాబు తో పాటు… త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా… కేంద్రంలో కీలక పదవి వస్తుందని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. మొత్తం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సోదరులందరికీ… కీలక పదవులు ఇచ్చేందుకు మోడీ కూడా సిద్ధంగా ఉన్నారని సమాచారం.

  Last Updated: 14 Jun 2024, 05:10 PM IST