Site icon HashtagU Telugu

Rajinikanth : చంద్రబాబు కు శుభాకాంక్షలు తెలియజేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

Rajani Cbn

Rajani Cbn

ఏపీలో కూటమి విజయం సాధించడం పట్ల చిత్రసీమ నుండి అభినందనల వెల్లువ హోరెత్తిస్తుంది. అగ్ర హీరోల దగ్గరి నుండి చిన్న చితక నటి నటులు ఇలా ప్రతి ఒక్కరు అభినందనలు తెలియజేస్తూ వస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి , వెంకటేష్ , రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు , ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ , మంచు విష్ణు ఇలా అనేక మంది సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లకు శుభాకాంక్షలు అందజేయగా..తాజాగా తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth ) చంద్రబాబు కు బెస్ట్ విషెష్ అందజేశారు.

‘‘పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించిన డీఎంకే అధినేత, నా ప్రియ మిత్రుడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌కు అభినందనలు తెలిపారు. అలాగే కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయం సాధించిన నా ప్రియ మిత్రుడు చంద్రబాబు నాయుడుకు నా హృదయపూర్వక అభినందనలు’ అంటూ నటుడు రజనీకాంత్ సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే క్రమంలో రజనీకాంత్ అభిమానులు , టిడిపి శ్రేణులు మాజీ మంత్రి రోజా , మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పై ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. ఎన్నికలలో ఓటమి పాలైన రోజా, కొడాలి నానిలకు అర్థమైందా రాజా అంటూ రజినీకాంత్ డైలాగ్ తో సెటైర్లు వేస్తున్నారు. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్టీఆర్ పైన, చంద్రబాబుపైన ప్రశంసలజల్లు కురిపించటంతో మంత్రి రోజా, కొడాలి నాని ఓ రేంజ్ లో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ఎన్నికల ఫలితాల తర్వాత గుర్తు చేస్తున్న రజినీకాంత్, చంద్రబాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా రజినీకాంత్ డైలాగులతో రోజాకు, కొడాలి నాని కి షాక్ ఇస్తున్నారు. రోజా, కొడాలి నాని అప్పట్లో చెప్పిన మాటలు, ఆ తర్వాత రజినీకాంత్ చెప్పిన మాటలు వీడియో ఎడిట్ చేసి పెడుతూ ట్రోల్ చేస్తున్నారు.

Read Also : JDU – NDA : బీజేపీకి షాక్.. అగ్నివీర్ స్కీం, యూసీసీపై సమీక్షించాల్సిందేనన్న జేడీయూ

Exit mobile version