Site icon HashtagU Telugu

AP : బాబు కోసం జైలుకు జైలర్..అర్థమైందా రాజా..!

Rajinikanth To Meet Chandrababu In Rajahmundry Jail

Rajinikanth To Meet Chandrababu In Rajahmundry Jail

స్కిల్ డెవలప్ కేసులో అరెస్టైన మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ను కలిసేందుకు రేపు సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) రాబోతున్నట్లు సమాచారం. జైలు ములాఖత్‌లో భాగంగా బాబును రజనీ కలవనున్నారని టీడీపీ వర్గాలు చెపుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయం తెలియగానే రజనీకాంత్ నారా లోకేష్ కు ఫోన్ చేసి, ధైర్యం చెప్పడం జరిగింది.

తన మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, ఈ తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని రజనీ ధీమా వ్యక్తంచేశారు. తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు ఏ తప్పు చేయరని, చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు.

ఇక ఇప్పుడు నేరుగా చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు జైలు కు రాబోతున్నాడు (Rajinikanth To Meet Chandrababu) జైలర్. గురువారం రాజమండ్రి జైలు (Rajahmundry Jail)లో చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసిన సంగతి తెలిసిందే. హీరో బాలకృష్ణ, టీడీపీ యువనేత నారా లోకేష్ లతో కలిసి జైలు కు వేలి చంద్రబాబు ను పవన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన- టీడీపీ కలిసి పోటీచేస్తాయని పవన్ అధికారికంగా ప్రకటించారు.

ఇక చంద్రబాబు అరెస్ట్ ను చిత్రసీమ నుండి దర్శకులు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్, మరో నిర్మాత నట్టికుమార్ ఖండించారు. అలాగే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్ వాద్ పార్టీ అధినేత మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, ఇతర సీనియర్ నేతలు చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. మరి రేపు రజని వస్తుండడం తో భద్రత ఏర్పాట్లు ఎలా ఉంటాయో..రజని ..చంద్రబాబు ను కలిసిన తర్వాత వైసీపీ నేతలు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే గతంలో చంద్రబాబు ను రజనీకాంత్ ప్రశంసలు కురిపించారని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు విమర్శలు చేశారు.