టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని చాగల్లు, పెద్దాపురంనకు చెందిన వివిధ వర్గాల మహిళలు కలసి సంఘీభావం తెలిపారు. రాజమహేంద్రవరం, విద్యానగర్ లోని క్యాంప్ సైట్ లో భువనేశ్వరిని కలిసి తమ మద్ధతు తెలిపారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేసిన చంద్రబాబు పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మహిళలు అన్నారు. స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్ల ద్వారా తమ ఊర్లలోని యువత కూడా శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించారని చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుండి చంద్రబాబు అరెస్టు దాకా తమకు నిత్యం అండగా నిలుస్తున్న మహిళల రుణం తీర్చుకోలేనిదని భువనేశ్వరి అన్నారు. కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నా ధైర్యంగా మహిళలు ముందుకు వచ్చి చంద్రబాబు కోసం పోరాడుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నప్పటికి నుంచి నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలు ఇద్దరు రాజమండ్రిలోనే బస చేస్తున్నారు. టీడీపీ నేతలు రాజమండ్రికి తరలివచ్చి వారికి సంఘీభావం తెలుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో దీక్షా శిభిరాలకు భువనేశ్వరి వెళ్తున్నారు. అక్కడ దీక్ష చేస్తున్న టీడీపీ కార్యకర్తలకు ఆమె సంఘీభావం తెలుపుతున్నారు.
Nara Bhuvaneswari : నారా భువనేశ్వరికి సంఘీభావం తెలిపిన మహిళలు

TDP