గోదావరి జిల్లాలకు మణిహారంగా నిలిచిన రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జి (Rajahmundry Bridge) 50 వసంతాలు (50yrs) పూర్తి చేసుకుంది. 1974లో ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ బ్రిడ్జి 50 ఏళ్లుగా సేవలందిస్తోంది. ఆసియా ఖండంలోనే అతి పొడవైన రెండో రోడ్ కం రైల్వే బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జ్ పొడవు రైలు మార్గం 2.8 కి.మీ, రోడ్ మార్గం 4.1 కి.మీ. 1974 నవంబరులో అప్పటి రాష్ట్రపతి ఫ్రకుద్దీన్ ఆలీ అహ్మద్ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు.
మరి 50 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ రాజమండ్రి ‘రోడ్ కం రైల్ బ్రిడ్జి’ (Rajahmundry Bridge) విశేషాలు తెలుసుకుందాం
ఈ రోడ్-కమ్-రైల్వే బ్రిడ్జి గోదారమ్మకు మణిహారంగా మారింది. ఉభయ గోదావరి జిల్లాలు, ప్రత్యేకంగా రాజమండ్రి, కొవ్వూరు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ నిర్మించబడిన ఈ వంతెన 1974 నవంబర్ 23 న అప్పటి రాష్ట్రపతి ఫ్రకుద్దీన్ అలీ అహ్మద్ చేత జాతికి అంకితం చేయబడింది. ఇది ఒక ఇంజినీరింగ్ అద్భుతంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వంతెన రాజమండ్రి వద్ద ప్రత్యేకంగా రూపొందించబడింది.
ఈ వంతెన భారతదేశంలో అతి పొడవైన రైల్-కమ్-రోడ్ బ్రిడ్జిలలో మూడవది. మొదటి వంతెన అస్సాంలో బ్రహ్మపుత్ర నదిపై, రెండో వంతెన బిహార్‌లో సోన్‌పూర్ వద్ద నిర్మించబడినవి. 1964లో పంచవర్ష ప్రణాళికలో కొవ్వూరు-రాజమండ్రి మధ్య ఈ వంతెనను నిర్మించాలని నిర్ణయించారు. అప్పటివరకు గోదావరి నదిని దాటేందుకు ప్రయాణాలు లాంచీలపైనే జరిగేవి.
ఈ వంతెన నిర్మాణం 1974 ఆగస్టులో పూర్తయింది. రైలు మార్గం 2.8 కి.మీ మరియు రోడ్ మార్గం 4.1 కి.మీ పొడవు ఉంది. ఈ వంతెన ప్రారంభోత్సవాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ బ్రిడ్జి ప్రారంభం కావడంతో కొవ్వూరు-రాజమండ్రి మధ్య షటిల్ బస్సులు ప్రారంభించబడ్డాయి. అందులో ఉభయ గోదావరి జిల్లాలు నేరుగా అనుసంధానమయ్యాయి. దీంతో పాటు పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందింది.
దశాబ్దాల తరబడి రైలు, రోడ్డు బ్రిడ్జిగా సేవలందించిన ఈ వంతెన సరైన నిర్వహణ లేకపోవడంతో పూర్తిగా పాడైంది. సెంట్రల్ క్యారేజ్ వే, వయాడక్ట్ భాగంతో పాటు వంతెన అప్రోచ్‌లు సహా దెబ్బ తిన్న సెకండరీ జాయింట్ల మరమ్మతుల నిమిత్తం సెప్టెంబర్ 27 నుంచి నవంబర్ 10 తేదీ వరకు బ్రిడ్జిని మూసివేశారు. తాజాగా మరమ్మతులు పూర్తికావడంతో…45 రోజుల తర్వాత తిరిగి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై వాహన రాకపోకలు మొదలయ్యాయి.
Read Also : Constitution Day 2024 : భారత రాజ్యాంగం@75 ఏళ్లు.. రేపు పార్లమెంటు, సుప్రీంకోర్టులో ప్రధాని ప్రసంగం