లోక్ సభ (Lok Sabha) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)..కడప లో పర్యటించారు. కడప కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వైస్ షర్మిల (Ys Sharmila) కు మద్దతుగా ఆయన ప్రచారం చేసారు. ముందుగా రాహుల్ హెలికాప్టర్‌లో ఇడుపులపాయ చేరుకొని అక్కడ YSR ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు. అనంతర కడప లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ..వైఎస్సార్ కేవలం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకే కాదు దేశానికి ఆదర్శమన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితోనే తాను భారత్ జోడో యాత్రను చేపట్టినట్లు చెప్పుకొచ్చారు. పాదయాత్ర చేసినప్పుడు ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకోవచ్చని వైఎస్సార్ తనతో చెప్పారన్నారు. రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతం.. కాంగ్రెస్ సిద్థాంతమన్నారు. సామాజిక న్యాయ కోసం, పేదల కోసం వైఎస్సార్ రాజకీయం చేశారన్నారు. కానీ ఏపీలో ఇప్పుడు ఆ రాజకీయం లేదన్నారు. బీజేపీ బీ టీమ్ నడిపిస్తోందని.. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని , ఈ ముగ్గురి రిమోట్ కంట్రోల్ మోడీ చేతిలోనే ఉందని పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మోడీ చేతిలో సీబీఐ, ఈడీ ఉన్నందునే ఈ ముగ్గురి కంట్రోల్ ఆయన చేతిలో ఉందని విమర్శించారు. జగన్‌రెడ్డిపై ఉన్న అవినీతి కేసులే ఆయన మౌనానికి కారణమని ధ్వజమెత్తారు. జగన్ మాదిరిగానే చంద్రబాబు కూడా కేసుల వల్ల నోరెత్తట్లేదని ఆరోపించారు. విభజన సమయంలో రాష్ట్రానికి కేంద్రం ఎన్నో హామీలిచ్చిందని, ఇచ్చిన హామీలేమీ నెరవేరలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం, కడప స్టీల్ ఇలా ఎన్నో హామీలు నెరవేరలేదని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ఉండి ఉంటే హామీలన్నీ నెరవేరేవని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పోలవరం, కడప స్టీల్‌ప్లాంట్ ఇస్తామన్న రాహుల్, రెండు లక్షల రుణమాఫీ, కేజీ టు పీజీ విద్య, రెండున్నర లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. నిరుపేదలకు రూ.5 లక్షలతో ఇళ్లు కట్టిస్తామని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విప్లవాత్మక మార్పులు తెస్తామన్నారు. పేదల జాబితా రూపొందించి సాయం చేస్తామన్నారు. పేద మహిళల ఖాతాల్లోకి నెలకి రూ.8,500 ఏడాదికి రూ.లక్ష జమచేస్తామని అన్నారు. షర్మిల తన చెల్లెలు అని, ఆమెను గెలిపించి లోక్‌సభకు పంపించాలని కోరారు.
Read Also : Kadapa : షర్మిలను గెలిపించండి – విజయమ్మ