Site icon HashtagU Telugu

Whats Today : వరంగల్‌లో రాహుల్ పర్యటన.. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

Whats Today

Whats Today

Whats Today : ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1.55 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా నర్సంపేటకు రాహుల్‌ చేరుకుంటారు. నర్సంపేట బహిరంగ సభలో పాల్గొని, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 3.40 గంటలకు మామునూరు విమానాశ్రయానికి రాహుల్ చేరుకుంటారు.  అనంతరం వరంగల్‌ చౌరస్తా నుంచి జేపీఎన్‌ రోడ్డు, మండిబజారు మీదుగా పోచమ్మమైదాన్‌ వరకు పాదయాత్రలో రాహుల్ పాల్గొంటారు. పోచమ్మమైదాన్‌ సెంటర్‌లో జరిగే కార్నర్ మీటింగ్ లో రాహుల్ ప్రసంగిస్తారు. సాయంత్రం 5.15 గంటకు హెలికాప్టర్‌లో రాహుల్ వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Nagula Chavithi : ఇవాళ నాగుల చవితి.. వర్జ్యం, దుర్ముహూర్తం ఇదీ..