Rahul Gandhi : ఇవాళ మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. ఈసందర్భంగా వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. తనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అవినాభావ సంబంధం ఉండేదని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘వైఎస్సార్ గొప్ప ప్రజానేత. ఆయన ఈ లోకం నుంచి భౌతికంగా వెళ్లిపోయినా.. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ ఎంతో తపించేవారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ఆయన లక్ష్యంగా ఉండేది’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
My humble tributes to former Chief Minister of Andhra Pradesh, YS Rajasekhara Reddy ji, on his 75th birth anniversary.
A true leader of the masses, his grit, dedication, and commitment to the upliftment and empowerment of the people of Andhra Pradesh and India has been a guiding… pic.twitter.com/iuGVsmsW8g
— Rahul Gandhi (@RahulGandhi) July 8, 2024
We’re now on WhatsApp. Click to Join
వైఎస్సార్ నడిచిన బాట నాటికి, నేటికీ దేశంలోని నేతలు అందరికీ ఆదర్శప్రాయమని ఆయన చెప్పారు. ‘‘వైఎస్సార్ నుంచి నేను వ్యక్తిగతంగా చాలా నేర్చుకున్నాను. ప్రజానేతగా వెలుగొందిన వైఎస్సార్ ఏపీ ప్రజల గుండెల్లో ఎప్పటికీ కొలువై ఉంటారు’’ అని రాహుల్ గాంధీ తెలిపారు. ఈమేరకు వీడియో సందేశాన్ని విడుదల చేసిన రాహుల్ గాంధీ.. తన వీడియో క్లిప్ మధ్యమధ్యలో పలు వైఎస్సార్ ఫొటోలను యాడ్ చేశారు. చివరగా తాను వైఎస్ షర్మిలతో కలిసి ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ కొన్ని వీడియో సీన్లను యాడ్ చేశారు. ఇవాళ విజయవాడ వేదికగా వైఎస్ షర్మిల వైఎస్సార్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్(ap congress) అగ్రనేత రాహుల్ గాంధీ విడుదల చేసిన వీడియో రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
Also Read : Vijay Sethupathi Maharaja OTT Release Date Lock : సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందహో..!
వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఆదివారం రోజే కీలక సందేశాన్ని విడుదల చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప వారసత్వాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, ఆయన కుమార్తె వైఎస్ షర్మిల ఏపీలో ముందుకు తీసుకెళ్తున్నారని సోనియా కొనియాడారు. షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజలకు సేవ చేయడం కోసం బలపడుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు.