Site icon HashtagU Telugu

Rahul Gandhi Reacts Tirupati Laddu: తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూపై స్పందించిన కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ

3 FIRs registered against Rahul Gandhi

3 FIRs registered against Rahul Gandhi

Rahul Gandhi Reacts Tirupati Laddu: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో పంపిణీ చేసే ప్రసిద్ధ తిరుపతి లడ్డూలో కల్తీ జరుగుతోందన్న వార్తలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi Reacts Tirupati Laddu) శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా రాహుల్ గాంధీ ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. మతపరమైన ప్రదేశాల పవిత్రతను కాపాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న మత స్థలాల పవిత్రతను సంబంధిత అధికారులు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. లార్డ్ బాలాజీ భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది భక్తులకు గౌరవనీయమైన దేవుడు. ఈ విషయం ప్రతి భక్తుడిని బాధిస్తుందని అన్నారు. ఆలయంలో ప్రసాదంగా అందించే లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారనే ఆరోపణలపై జాతీయ స్థాయిలో వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. “భారతదేశం అంతటా అధికారులు మన మతపరమైన ప్రదేశాల పవిత్రతను కాపాడాలి” అని అన్నారు.

Also Read: Virat Kohli-Shakib Al Hasan: లైవ్ మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్‌ను ఆట ప‌ట్టించిన విరాట్ కోహ్లీ.. వీడియో వైర‌ల్‌

తిరుపతి లడ్డూ వివాదం ఏంటి?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు లడ్డూలలో వాడే పదార్థాల నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో విఫలమైందని ఆరోపించారు. లడ్డూల తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు, ఇతర ప‌దార్థాలు ఉన్న‌ట్లు ఆయ‌న ఇటీవ‌ల తెలిపారు.

శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో శ్యామ‌ల‌రావు సైతం శుక్రవారం నాణ్యమైన నెయ్యి, నాసిరకం నెయ్యి, పంది కొవ్వు (పంది కొవ్వు) ఉన్నట్లు తేలిందని మీడియాకు తెలిపారు. మ‌రోవైపు ఇది ఓ క‌ట్టు క‌థ అని, ఏపీలో డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ జ‌రుగుతున్నాయ‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ మీడియా స‌మావేశం పెట్టి చెప్పుకొచ్చారు.