Site icon HashtagU Telugu

Andhra University : ఆంధ్ర యూనివర్సిటీ లో ర్యాగింగ్ కలకలం

Andhra University

Andhra University

ర్యాగింగ్ పై ప్రభుత్వాలు , విద్యాసంస్థలు ఉక్కుపాదం మోపుతున్న అడపాదడపా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University)లోని ఆర్కిటెక్చర్ డిపార్ట్‌మెంట్‌లో ర్యాగింగ్ (Raging ) కలకలం రేపింది. జూనియర్ విద్యార్థినులు అసభ్యకరమైన డ్యాన్సులు చేయాలంటూ సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. హాస్టల్‌లో డ్యాన్సులు వేయాలంటూ ర్యాగింగ్ చేయడమే కాకుండా ఇదంతా వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. తమకు డ్యాన్స్ రాదని చెప్తే అబ్బాయిల దగ్గరకు వెళ్లి నేర్చుకుని రమ్మని సీనియర్లు ఇబ్బంది పెట్టినట్లు బాధితులు వాపోయారు.

ర్యాగింగ్ విషయాన్ని ప్రొఫెసర్ల దృష్టికి తీసుకెళ్తే సీనియర్ల తమను మరింత ఇబ్బందులకు గురి చేస్తారేమో అని జూనియర్లు ఆందోళనకు గురయ్యారు. దిక్కుతోచని స్థితిలో కొందరు విద్యార్థినులు మీడియాను ఆశ్రయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. 3 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగుచూడడంతో యూనివర్శిటీ యాజమాన్యం విచారణ జరిపి చర్యలు చేపట్టింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 10 మంది విద్యార్థినులను 15 రోజుల పాటు సస్పెండ్ చేసింది.

Read Also : Emraan Hashmi : హీరో ఇమ్రాన్ హష్మి కు గాయాలు