Raghuramakrishna Raju : రఘురామకు ఆ పార్టీ నుంచి అసెంబ్లీ టికెట్ !

ఏపీ పాలిటిక్స్‌లో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు స్టైలే వేరు!! ఈ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని ఆయన అంటున్నారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు ? ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు ?

  • Written By:
  • Updated On - April 4, 2024 / 03:28 PM IST

Raghuramakrishna Raju : ఏపీ పాలిటిక్స్‌లో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు స్టైలే వేరు!! ఈ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని ఆయన అంటున్నారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు ? ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు ? అనేది మాత్రం చెప్పడం లేదు. కనీసం అసెంబ్లీకి పోటీ చేస్తారా ? లోక్‌సభకు పోటీ చేస్తారా ? అనే దానిపైనా రఘురామ క్లారిటీ ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆయన ఎదుట టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తప్ప మరో ఆప్షన్ లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రఘురామ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సాపురం టికెట్ ను శ్రీనివాస్ వర్మకు బీజేపీ కేటాయించింది. ఈనేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ టికెట్‌ను ఆయనకు ఇచ్చేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబు ఓకే చెప్పారనే ప్రచారం జరుగుతోంది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుతో రఘురామ భేటీ కాగా దీనిపై క్లారిటీ వచ్చిందని అంటున్నారు. శుక్రవారంరోజు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగే సభ వేదికగా చంద్రబాబు సమక్షంలో రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరనున్నట్టు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join

నర్సాపురం, ఏలూరు లోక్‌సభ టికెట్ల స్వాపింగ్ ?

వైఎస్సార్ సీపీ నుంచి గెలిచి కూడా ఆ పార్టీపైనే పోరాటం చేస్తున్న రఘురామకు ఎన్డీయే కూటమి నుంచి నర్సాపురం టికెట్ వస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. కానీ అలా జరగలేదు. అయితే పొత్తుల్లో భాగంగా ఆ సీటును బీజేపీ దక్కించుకుంది. ఆ పార్టీ నేతకే టికెట్‌ను కేటాయించారు. దీంతో రఘురామ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈనేపథ్యంలో ఒకానొక దశలో ఏలూరు ఎంపీ సీటును బీజేపీకి ఇచ్చేసి.. నర్సాపురం ఎంపీ సీటును తీసుకోవాలని టీడీపీ భావించిందని తెలుస్తోంది. మరోవైపు ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ యాదవ్‌కు అవకాశం కల్పించారు. యనమల రామకృష్ణుడు ఫ్యామిలీ మొదటినుంచీ టీడీపీకి విశ్వాసపాత్రంగా ఉంది. విపక్షంలో ఉన్నా చంద్రబాబు వెంటే నడిచింది. అటువంటి ఫ్యామిలీకి చెందిన వారికి కేటాయించిన టికెట్‌ను వెనక్కి తీసుకోవడం సరికాదనే అభిప్రాయానికి చంద్రబాబు వచ్చారట. అందువల్లే రఘురామకు నర్సాపురం లోక్‌సభ టికెట్ కోసం బీజేపీతో రాజీ చర్చలు చేస్తూ కూర్చోవడం ఇక అక్కర్లేదనే నిర్ణయాన్ని టీడీపీ చీఫ్ తీసుకున్నారట. దానికి బదులు టీడీపీ నుంచి ఏదైనా అసెంబ్లీ టికెట్‌ను రఘురామకు ఇస్తే సరిపోతుందని చంద్రబాబు అనుకున్నారట. అందులో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ టికెట్‌ను రఘురామకు కేటాయించారని సమాచారం.

Also Read :Billionaire To Zero : బిలియనీర్ జీరో అయ్యాడు.. బైజూస్ అధినేత నెట్ వర్త్ ‘జీరో’ !