ఏపీ నూతన గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghurama Krishnan Raju) కలిశారు. ఢిల్లీలోని జస్టిస్ నజీర్ నివాసానికి ఈ ఉదయం రఘురాజు వెళ్లి, పుష్పగుచ్ఛాన్ని అందించి, శ్రీవేంకటేశ్వరస్వామి చిత్రం ఉన్న శాలువాను కప్పి గౌరవించారు.
మర్యాదపూర్వకంగా జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిశానని… ఏపీ గవర్నర్ గా నియమితులైన నేపథ్యంలో అభినందనలు తెలిపానని ట్విట్టర్ వేదికగా రఘురాజు (Raghurama Krishnan Raju) వెల్లడించారు. సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ అబ్దుల్ నజీర్ పలు కీలక కేసులను విచారించారు. అయోధ్య భూవివాదం, ట్రిపుల్ తలాక్ వంటి కేసుల్లో తీర్పులను వెలువరించారు.
Also Read: Virus Threat to the World: ప్రపంచానికి మరో వైరస్ ముప్పు ..!