Site icon HashtagU Telugu

Raghurama Krishnamraju : నర్సాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రఘురామ కృష్ణంరాజు..?

Rrr Tdp Mp

Rrr Tdp Mp

రీసెంట్ గా వైసీపీ (YCP) కి రాజీనామా చేసిన ఎంపీ రఘురామ కృష్ణం రాజు (Raghurama Krishnamraju)..ఇప్పుడు టీడీపీ (TDP) ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నాడు. 2019 ఎన్నికల్లో న‌ర‌సాపురం పార్లమెంటు స్థానం (Narsapuram MP Seat) నుంచి వైసీపీ తరపున ర‌ఘురామ‌కృష్ణరాజు పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. జనసేన తరపున కొణిదెల నాగ‌బాబు, టీడీపీ తరపున వేటుకూరి వెంక‌ట శివ‌రామ‌రాజు బరిలో నిలిచారు. అయితే వైసీపీ అభ్యర్థిగా రఘురామ 31,909 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. ఆ తవ్రతః వైసీపీ నేతలకు, ఆయ‌న‌కు మ‌ధ్య విభేదాలు తలెత్తాయి. ఇలా ఏర్పడిన విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఆయన పార్టీకి దూరమయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలోనే ఎంపీ అనుచ‌రుల‌పై స్థానిక ఎమ్మెల్యేలు.. పార్టీ నాయ‌కులు కేసులు పెట్టడం.. ఆయ‌న ఫ్లెక్సీలు పెట్టకుండా అడ్డుకోవడం వంటి పరిణామాలు జరగడంతో ఆయన పార్టీకి రెబల్‌గా మారిపోయారు. అప్పటి నుంచి ఢిల్లీలోనూ ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలపై తన గళం వినిపిస్తూ వచ్చారు.ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు ర‌ఘురామ‌పై కేసులు న‌మోదు చేయ‌డం.. ఆయ‌న‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జైలులో తనపై లాఠీ ఛార్జి చేశారంటూ ఆయన కోర్టులో తెలపడం సంచనలంగా మారాయి. అనంతరం సుప్రీంకోర్టు జోక్యంతో హైద‌రాబాద్‌లోని ఆర్మీ ఆసుప‌త్రికి తరలించి చికిత్స అందించారు. ఇలా మొత్తం త‌న ఐదేళ్ల ప‌ద‌వీ కాలంలో 4 ఏళ్ల పాటు రెబ‌ల్‌గానే ఉన్నారు. ఇక రీసెంట్ గా వైసీపీ కి రాజీనామా చేసిన రఘురామ..ఇప్పుడు టీడీపీ నుండి బరిలోకి దిగబోతున్నాడు.

రీసెంట్ గా టీడీపీ – జనసేన కూటమి తమ మొదటి విడత అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 94 మంది అభ్యర్థులతో టీడీపీ బరిలోకి దిగుతుండగా..24 మంది అభ్యర్థులతో జనసేన బరిలోకి దిగబోతుంది. కాగా నర్సాపురం ఎంపీ స్థానం నుంచి రఘురామను బరిలోకి దింపాలని టీడీపీ చూస్తుంది. ఇప్పటీకే ఆ మేరకు అక్కడ సర్వే చేయించినట్లు సమాచారం. అతి త్వరలో రఘురామ పేరు ను టీడీపీ అధిష్టానం ప్రకటించనున్నట్లు వినికిడి.

Read Also : Rajya Sabha Elections 2024: హిమాచల్‌లో సమాన ఓట్లు.. ఓటమి అంగీకరించిన కాంగ్రెస్