ఏపీ ఎన్నికలపైనే అందరి దృష్టి..తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం తో..ఏపీ లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే పలు సర్వేలు పలు జనసేన – టీడీపీ కూటమి గెలుస్తాయని తెలుపగా..మరికొన్ని సర్వేలు వైసీపీ గెలుస్తుందని వెల్లడించాయి. ఈ క్రమంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు..ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధింస్తుందో చెప్పుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, దాదాపు 135 స్థానాల్లో ఆ పార్టీల అభ్యర్థులు అప్రతిహత విజయం సాధిస్తారని ఎంపీ రఘురామ కృష్ణరాజు జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల పగ్గాలు చేపడితే టీడీపీ-జనసేన కూటమి మరో 20 స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు.
ఇదే సందర్బంగా జగన్ ఫై రఘురామ నిప్పులు చెరిగారు. సీఎం జగనకు ప్రభుత్వ సొమ్ము నొక్కేయడమే తెలుసని, ఖర్చు చేయడం తెలియదని .. నానుంచి జగన్ సాయం అర్థించాడే తప్పా.తానకు జగన్ ఎప్పుడు సాయం చేయలేదని రఘురామ చెప్పుకొచ్చారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు జైలు ఉండగా, సాయం చేసిన వారే నిజమైన మిత్రులని వారే చంద్రబాబు, పవన్ కల్యాణ్ అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ముక్తకంఠంతో వ్యతిరేకించాను కాబట్టే జగన్ తనపై పగబట్టి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని గుర్తు చేశారు.
Read Also : M Aadhaar: ఇకపై క్షణాల్లోనే మీ స్మార్ట్ ఫోన్ లో ఆధార్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్.. పూర్తి వివరాలివే?