Rajdhani-Files-Movie: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు(raghu rama krishnam raju మరోసారి సిఎం జగన్(jagan) పై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సింహం కాదు చిట్టెలుక అనీ, రాజధాని ఫైల్స్ సినిమా(Rajdhani Files Movie)కు సింహం జంకిందని అన్నారు. గంగ చంద్రముఖిగా మారడం రొటీనే కానీ సింహం చిట్టెలుకగా మారడమే వెరైటీ అని ఆయన అపహాస్యం చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కు ఓటు వేస్తే, మీ ఇంటికి చంద్రముఖిలు వస్తారని జగన్ మోహన్ రెడ్డి గారు ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రముఖి అంత బ్యాడ్ క్యారెక్టర్ ఏమీ కాదమ్మా… అంటూ సెటైర్లు వేశారు. బహుశా ఆ విషయం జగన్ మోహన్ రెడ్డి గారికి తెలియక పోవచ్చునని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. రాజధాని ఫైల్స్ సినిమానే కాకుండా ఇంకా చాలా సినిమాలు రావచ్చునని, ఓటీటీలో కూడా బాబాయ్ అనే సినిమా కూడా వస్తుందట అని అన్నారు. రాజధాని సినిమా దర్శకుడు భాను, నిర్మాత కంఠంనేని రవిశంకర్ గారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. రాజధాని ఫైల్స్ సినిమాను మనసున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చూసి అమరావతి రైతులకు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరారు.
We’re now on WhatsApp. Click to Join.
రాజధాని ఫైల్స్ సినిమాలో తాను కూడా నటించాల్సి ఉండగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టలేని పరిస్థితుల్లో ఈ సినిమాలో నటించలేపోయానని రఘురామకృష్ణ రాజు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ రాష్ట్రంలో నిర్వహించగా తాను ఢిల్లీలో ఉండడం వల్ల సినిమాలో నటించలేకపోయానన్నారు. అమరావతి ఫైల్స్ పేరుపై సెన్సార్ బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ సినిమా పేరును రాజధాని ఫైల్స్ గా నామకరణం చేశారని, ఈ సినిమా బాలరిష్టాలన్నీ దాటుకొని థియేటర్లలో ప్రదర్శించాల్సిన సమయంలో, ఎన్నికలు వస్తున్నాయి… ఈ సినిమా వల్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వచ్చేలా ఉందని వైకాపా తరఫున ఎవరో ఒకరు కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు.
గతంలో చంద్రబాబు నాయుడు గారికి కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు, బెయిల్ కాపీ జైలుకు ఎలా వెంటనే వెళ్లిందని కొంత మంది ప్రశ్నించారని, గురువారం ఉదయం 10 గంటల 45 నిమిషాలకు న్యాయస్థానం స్టే ఇస్తే, 11 గంటలకే షోను థియేటర్లలో ఎలా నిలిపి వేశారని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. సినిమా థియేటర్ల యజమానులు ఆర్డర్ కాపీ గురించి ప్రశ్నిస్తే వారిపై బెదిరింపులకు దిగారని, మల్టీప్లెక్స్ లలో సినిమా చూస్తుండడం కూడా ఆపివేశారని అన్నారు. 175 స్థానాలకు 175 స్థానాలు గెలుస్తామని చెప్పుకునే సింగిల్ సింహం, రాజధాని ఫైల్స్ సినిమాను చూసి బెదురు చూపులు చూస్తూ పరిగెత్తాల్సి వచ్చిందని, జగన్ మోహన్ రెడ్డి గారు భయపడ్డారని అన్నారు.
read also : Etela Rajender : కాంగ్రెస్ లోకి ఈటెల..?