Site icon HashtagU Telugu

AP Volunteer: వివాహితను పెట్టుకెళ్ళిపోయిన వాలంటీర్: వైసీపీ రెబల్ ఎంపీ

AP Volunteer

New Web Story Copy 2023 08 02t165210.472

AP Volunteer: వైసీపీ ఎంపీ అయినప్పటికీ ఆ పార్టీకి రెబెల్ గా మారారు ఎంపీ రఘురామకృష్ణ. నిత్యం వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే రఘురామకృష్ణ రాజు కొంతకాలంగా వాలంటీర్ వ్యవస్థపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన వాలంటీర్ వ్యవస్థని తప్పుబట్టారు.

పెళ్ళైన ఓ మహిళను వాలంటీర్ పట్టుకెళ్ళిపోయాడని షాకింగ్ కామెంట్స్ చేశారు రఘురామకృష్ణ రాజు. మొన్న వృద్ధురాలిని ఓ వాలంటీర్ హత్య చేశాడని, తాజాగా పెళ్లైన మహిళను వాలంటీర్ ఎత్తుకెళ్లిపోయాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. వాలంటీర్ నేరుగా ఇంట్లోకి వెళ్లి వివరాలు తెలుసుకుంటున్నారని, ఇంట్లోకి వెళ్ళడానికి వాళ్లకేం హక్కు ఉందన్నారు రఘురామకృష్ణ రాజు. వాలంటీర్లు ఎవరి ఇంటిపడితే వాళ్ళ ఇంటికి వెళ్లి బియ్యం కావాలా, డబ్బులు కావాలా అని అడుగుతున్నారని విమర్శించారు. వాలంటీర్లకు ఆ హక్కు లేదని, దీనికి సీఎం జగన్ బాధ్యత వహిస్తారా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వాలంటీర్లపై జోకులు పేల్చుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక బాబాయిని హత్య చేసిన వ్యక్తి బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడని, కోడికత్తి శ్రీను మాత్రం జైలులోనే మగ్గుతున్నాడని తెలిపారు. ఎదో ఒకరోజు కోడికత్తి శ్రీను పరిస్థితి మొద్దు శ్రీనులా మారుతుందని వ్యాఖ్యానించారు.

Also Read: video viral: వరద నీటిలోనే పెళ్లి చేసుకున్న జంట.. వీడియో వైరల్?