TDP-Janasena : జ‌న‌సేన‌లోకి రాధా ? `క్విడ్ ప్రో కో`చ‌ద‌రంగంలో వంగ‌వీటి, క‌న్నా.!

వంగ‌వీటి రాధా(TDP-Janasena) త్వ‌ర‌లోనే జ‌న‌సేన గూటికి చేర‌తార‌ని తాజా టాక్‌.

  • Written By:
  • Updated On - March 1, 2023 / 10:04 AM IST

ప్ర‌స్తుతం వంగ‌వీటి రాధా టీడీపీలో (TDP-Janasena) ఉన్నారు. ఆయ‌న (Vangaveeti) త్వ‌ర‌లోనే జ‌న‌సేన గూటికి చేర‌తార‌ని తాజా టాక్‌. బీజేపీ మాజీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వారం క్రితం టీడీపీలో చేరారు. తొలుత ఆయ‌న జ‌న‌సేన పార్టీలో చేర‌తార‌ని టాక్ న‌డిచింది. ఇదంతా టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న‌తో జ‌రుగుతోన్న రాజ‌కీయ ప‌రిణామంగా వైసీపీతో స‌హా ప్ర‌త్యర్థులు భావిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన క‌లిసి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని గ‌ద్దె దింప‌డానికి అంత‌ర్గ‌త ఒప్పందం కుదిరింద‌ని వినికిడి. ఆ క్ర‌మంలోనే బ‌ల‌మైన లీడ‌ర్ల‌ను ఇత‌ర పార్టీల వైపు వెళ్ల‌కుండా ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న‌తో టీడీపీ, జ‌న‌సేన ఆకర్షిస్తున్నాయ‌ట‌.

వంగ‌వీటి రాధా  త్వ‌ర‌లోనే జ‌న‌సేన గూటికి.(TDP-Janasena)

గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా వైసీపీకి గుడ్ బై చెప్పిన‌ వంగవీటి రాధా టీడీపీ(TDP-Janasena) గూటికి చేరారు. ఆయ‌న విజ‌య‌వాడ సెంట్ర‌ల్ స్థానం కావాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద ఒత్తిడి తెచ్చారు. కానీ, మ‌చిలీప‌ట్నం ఎంపీగా పోటీ చేయాల‌ని ఆదేశించారు. దీంతో మ‌న‌స్తాపం చెందిన రాధా రాత్రిరాత్రికి చంద్ర‌బాబును క‌లిశారు. టీడీపీ పంచ‌న చేరారు. ఆనాటి నుంచి టీడీపీలో ఉంటున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌కు పెద్ద‌గా ఆ పార్టీలో ప్రాధాన్యం లేదు. దీంతో చాలా కాలంగా అస‌హ‌నంగా ఉంటున్నార‌ని పార్టీలోని అంత‌ర్గ‌త చర్చ‌. ప్ర‌త్యామ్నాయంగా జ‌న‌సేన వైపు రాధా(Vangaveeti) చూస్తున్నార‌ని వినిపిస్తోంది. గ‌తంలోనూ ప్ర‌జారాజ్యంలో ప‌నిచేసిన అనుభ‌వం ఆయ‌న‌కు ఉంది. ఒకే సామాజిక‌వ‌ర్గం కావ‌డంతో జ‌న‌సేన‌కు రాధా వెళ‌తారని విజ‌య‌వాడ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లోని బ‌ల‌మైన టాక్‌.

గుడివాడ నుంచి పోటీ చేయాల‌ని ఒకానొక సంద‌ర్భంలో రాధాకు..

తెలుగుదేశం పార్టీ త‌ర‌పున గుడివాడ నుంచి పోటీ చేయాల‌ని ఒకానొక సంద‌ర్భంలో రాధాకు(Vangaveeti) టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు సూచించార‌ట‌. ఆ సంద‌ర్భంగా ఆయ‌న గుడివాడ అనుచ‌రుల‌తో స‌మావేశం కూడా నిర్వ‌హించార‌ని అప్ప‌ట్లో వినిపించింది. అదే స‌మ‌యంలో ఆయ‌న మీద ఎవ‌రో రెక్కీ నిర్వ‌హించార‌న్న న్యూస్ కూడా వ‌చ్చింది. దానిపై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం కూడా స్పందించింది. వంగ‌వీటి రాధా ఫిర్యాదు ఇవ్వ‌న‌ప్ప‌టికీ ఒక ప్ర‌త్యేక క‌మిటీని వేసి రెక్కీ వ్య‌వ‌హారాన్ని తేల్చాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌య‌త్నించింది. కానీ, ఆ త‌రువాత అదంతా తూచ్ గా తేలింది. ఆ స‌మ‌యంలోనే గుడివాడ ప‌ర్య‌ట‌న‌కు కూడా రాధా వెళ్లారు. ఇంకేముంది, గుడివాడ ఎమ్మెల్యే మీద వంగ‌వీటి రాధా టీడీపీ అభ్య‌ర్థి అంటూ ప్ర‌చారం జ‌రిగింది. సీన్ క‌ట్ చేస్తే, ఏదో ప్రైవేటు కార్య‌క్ర‌మానికి వెళ్లిన క్ర‌మంలో అలాంటి టాక్ వ‌చ్చింద‌ని తేలింది.

Also Read : TDP Radio : మోడీ `మ‌న్ కీ బాత్` త‌ర‌హాలో రేడియో ద్వారా చంద్ర‌బాబు వాయిస్

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, వంగ‌వీటి రాధా (TDP-Janasena)రాజ‌కీయాల‌కు అతీతంగా స్నేహాన్ని క‌లిగి ఉన్నారు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య రాజ‌కీయ పోటీ అన‌గానే రాజ‌కీయం ఉవ్వెత్తున ఎగ‌సింది. కానీ, స్నేహితునిపై పోటీకి రాధా నుంచి పాజిటివ్ సంకేతం టీడీపీ అధిష్టానంకు వెళ్ల‌లేదు. దీంతో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ రాధాకు ఇవ్వాల్సిన ప‌రిస్థితి టీడీపీకి అనివార్యంగా మారింది. కానీ, అక్క‌డ నుంచి టీడీపీ పూర్వ‌పు లీడ‌ర్లు ఉన్నారు. వాళ్ల‌ను కాద‌ని, రాధాకు ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌ధ్యే మార్గంగా పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు ఆ స్థానం ఇవ్వ‌డానికి టీడీపీ డిసైడ్ అయింద‌ని తెలుస్తోంది. అందుకే, వంగ‌వీటి రాధా(Vangaveeti) టీడీపీ నుంచి జ‌న‌సేన‌కు వెళ్ల‌నున్నార‌ని తెలుస్తోంది. అందుకు, టీడీపీ అధిష్టానం కూడా ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ విష‌యంలోనూ ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణి (TDP-Janasena)

ఇటీవ‌ల టీడీపీలో చేరిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ విష‌యంలోనూ ఇచ్చిపుచ్చుకునే(TDP-Janasena) ధోర‌ణి క‌నిపించింది. వాస్త‌వంగా జ‌న‌సేన‌లోకి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ చేరాలి. ఆ పార్టీ త‌ర‌పున గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నుంచి పోటీ చేయాలి. కానీ, చివ‌రి నిమిషంలో టీడీపీలో చేరిన ఆయ‌న స‌త్తెన‌ప‌ల్లి నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా పోటీకి దిగ‌నున్నారు. అక్క‌డ జ‌న‌సేన‌కు పెద్ద‌గా బ‌లం లేదు. కానీ, గెలుపోట‌ముల‌ను నిర్ణ‌యించే స్థాయి ఓట‌ర్లు మాత్ర‌మే ఉన్నార‌ని అంచ‌నా. ఒక వేళ జ‌న‌సేన అభ్య‌ర్థిగా క‌న్నా బ‌రిలోకి దిగిన‌ప్ప‌టికీ అక్క‌డున్న టీడీపీ సంపూర్ణంగా మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించే అవ‌కాశం లేదు. అదే స‌మ‌యంలో టీడీపీకి బల‌మైన అభ్య‌ర్థి కూడా అక్క‌డ లేడు. రెండు విధాలుగా ఆలోచించిన టీడీపీ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను ఆక‌ర్షించింది. ఇంత జ‌రుగుతున్న‌ప్ప‌టికీ జ‌న‌సేన నుంచి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు కు ఎలాంటి ఆహ్వానం లేదు. క‌నీసం సంప్ర‌దింపులు కూడా లేవు. అంటే, జ‌న‌సేన ఇష్ట‌పూర్వ‌కంగా టీడీపీలోకి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను పంపించింద‌న్న‌మాట‌.

బీజేపీ నుంచి ప‌వ‌న్ ఆశించిన రోడ్ మ్యాప్ (Vangaveeti)

అటు క‌న్నా ఇటు వంగ‌వీటి రాధాల(Vangaveeti) రాజ‌కీయ ప్ర‌యాణాన్ని చూస్తుంటే టీడీపీ, జ‌న‌సేన ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణిలో వెళుతున్నాయ‌ని అర్థమ‌వుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ నుంచి ప‌వ‌న్ ఆశించిన రోడ్ మ్యాప్ రాక‌పోయిన‌ప్ప‌టికీ, ఆయ‌న టీడీపీతో క‌లిసి న‌డ‌వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆ మేర‌కు జ‌న‌సేన వ‌ర్గాల్లో బ‌లంగా వినిపించ‌డ‌మే కాకుండా, ఒంట‌రిగా వెళ్లి వీర‌మ‌ర‌ణం పొంద‌డం కంటే పొత్తు మేల‌ని ప‌రోక్షంగా ఇటీవ‌ల ప‌వ‌న్ సంకేతాలు ఇచ్చారు. ఆ క్ర‌మంలో టీడీపీతో(TDP-Janasena) తెర‌వెనుక క‌లిసి ప‌నిచేస్తోన్న జ‌న‌సేనాని బీజేపీ ని కూడా క‌లుపుకుని పోవాల‌ని చూస్తున్నారు. కానీ, ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల నుంచి సానుకూల సంకేతం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి పరిస్థితుల్లో జ‌రుగుతోన్న ప‌ర‌స్ప‌ర చేరిక‌లు హాట్ టాపిక్ అయింది.

Also Read : TDP Old : తెలుగుదేశం వైపు 70ప్ల‌స్ ! క‌న్నా చేరిక‌తో 1983 బ్యాచ్ యాక్టివ్ !