R Krishnaiah resigned to Rajya Sabha Membership : ఇప్పటికే వైసీపీ (YCP) పార్టీకి ఇద్దరు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు గుడ్ బై చెప్పగా..ఇప్పుడు ముచ్చటగా మూడో సభ్యుడు ఆర్.కృష్ణయ్య కూడా గుడ్ బై చెప్పారు. త్వరలోనే వైసీపీ పార్టీ (YCP) ఖాళీ పార్టీ అవ్వబోతుందా..? కేవలం జగన్ (Jagan) ఫ్యామిలీ సభ్యులు మాత్రమే పార్టీలో మిగులుతారా..? వైసీపీ లో ఉంటె ప్రజలు ఏమాత్రం క్షమించరాని భావిస్తున్నారా..? రాజకీయ భవిష్యత్ ఉండాలంటే వైసీపీ ని వదలసిందే అని ఫిక్స్ అవుతున్నారా..? అంటే ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల ముందు నుండి పార్టీ నేతలు జగన్ కు షాక్ ఇస్తూనే ఉన్నారు. మీము ఉండలేం అంటూ ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తున్నారు. ఇప్పటీకే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు , జడ్పీటీసీ , ఎంపీటీసీ , సర్పంచ్ లు ఇలా అంత బయటకు రాగా.. తాజాగా రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య (R Krishnaiah) సైతం ఫ్యాన్ వదిలేసాడు.
కృష్ణయ్య తన ఎంపీ పదవికి , అలాగే వైసీపీకి రాజీనామా చేసారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ కు రాజీనామాలేఖను అందించారు. రాజ్యసభ చైర్మన్ వెంటనే రాజీనామాను ఆమోదించారు. ఆ పోస్టు కాళీ అయిందని గెజిట్ విడుదల చేశారువైసీపీ నుంచి 2022లో ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు ఎన్నికయ్యారు. తన పదవీ కాలం మరో నాలుగేళ్లు ఉండగానే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. బీసీ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకే రాజీనామా చేసినట్లు ఆర్.కృష్ణయ్య తెలిపారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని విస్తరించడంపై ఆర్.కృష్ణయ్య దృష్టిపెట్టారు.
కాగా, ఆర్.కృష్ణయ్య త్వరలోనే బీజేపీలో చేరతారని ఇటీవల ప్రచారం జరిగింది. తెలంగాణలో బీసీ ఓటు బ్యాంకును మరింత పెంచుకునే దిశగా బీజేపీ దృష్టి సారించింది. దీంతో ఆర్.కృష్ణయ్యతో బీజేపీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. బీజేపీలో ఆర్.కృష్ణయ్యకు కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి నిజంగా ఆయన బిజెపి లో చేరతారా లేదా అనేది చూడాలి. ఇక జాతీయస్థాయిలో కృష్ణయ్యకు మంచి పేరు ఉంది. బీసీ సంఘం నేతగా గుర్తింపు ఉంది. అదే గుర్తింపుతో అన్ని రాజకీయ పార్టీలు ఆయనకు గౌరవించాయి. రాజకీయ అవకాశాలను కల్పించాయి.
తొలుత తెలంగాణలో టీడీపీ పార్టీ ఏకంగా నాయకత్వం బాధ్యతలను కృష్ణయ్యకు అప్పగించింది. అసెంబ్లీ టికెట్ కూడా కేటాయించింది. ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలిచారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి.. కృష్ణయ్యను పిలిచి మరీ రాజ్యసభ స్థానాన్ని కట్టబెట్టింది. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ పై అనేక విమర్శలు వచ్చాయి. అయినా సరే పార్టీకి పనికొస్తుందని ఆయన భావించారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో కృష్ణయ్య మైండ్ సెట్ మారినట్లు తెలుస్తోంది.
Read Also : Home Loans : అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వద్దు – బ్యాంకులకు హైడ్రా సూచన