టీడీపీ మాజీ నేత ఎంపీ కేశినేని నాని (Keshineni Nani) ఫై అగ్ర నిర్మాత , బిజినెస్ మాన్ పీవీపీ (PVP) ..ఘాటైన వ్యాఖ్యలే చేసారు.బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంటూ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం నేతల వలసలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీల్లోకి..ప్రతి పక్ష పార్టీల నేతలు అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున వైసీపీ నుండి నేతలు జనసేన , టీడీపీ లలో చేరగా..సంక్రాంతి తర్వాత ఈ సంఖ్య భారీగా పెరగనుందని తెలుస్తుంది. ఈ క్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని..నిన్న వైసీపీ అధినేత జగన్ (CM Jagan) ను కలిశారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ చంద్రబాబు , లోకేష్ లపై సంచలన వ్యాఖ్యలు చేసారు. మొన్నటి వరకు టీడీపీ లో ఉండి, చంద్రబాబు , లోకేష్ ల వెంట ఉంటూ..వారిపైనే అతి దారుణమైన వ్యాఖ్యలు చేయడం యావత్ తెలుగు తమ్ములతో పాటు టీడీపీ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదే తరుణంలో నాని ఫై టీడీపీ నేతలు విరుచుకపడుతున్నారు. తాజాగా నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంటూ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. ‘‘బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే.. వీడి బుద్ది గురించి బెజవాడంతా తెలుసుకదరా అబ్బాయ్’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. 2019 ఎన్నికల్లో కేశినేని నానిపై వైసీపీ నుంచి పీవీపీ పోటీ చేసి ఓడిన విషయం తెలిసిందే. అయితే ఇద్దరికీ మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. కేవలం నాని 8,726 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల తర్వాత పీవీపీ పెద్దగా ఎక్కడా కనిపించలేదు. పార్టీ అధికారంలోకి ఉన్నప్పటికీ ఆయన మాత్రం అడ్రస్ లేరు. ఇప్పుడు ప్రత్యర్థి కాస్త సొంత పార్టీలోకి రావడంతో పీవీపీ రగలిపోతున్నట్లు ఈ ట్వీట్‌ను బట్టి చూస్తే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే..వీడి గుడిసేటి బుద్ధి గురించి బెజవాడంతా తెలుసుకదరా అబ్బాయ్!!
— PVP (@PrasadVPotluri) January 11, 2024
Read Also : Telangana : జాగ్రత్త..ప్రజాపాలన పేరుతో ఫోన్ కాల్స్..క్షణాల్లో అకౌంట్ లో డబ్బులు మాయం