Site icon HashtagU Telugu

Puttaparthi : ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకోండి!

సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీ 40వ స్నాతకోత్సవం సోమవారం ప్రశాంతి నిలయంలో జరుగుతున్నాయి. పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఉదయం 9గంటలకు యూనివర్సిటీ స్నాతకోత్సవం ప్రారంభమైంది. భారత సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పట్టాలు అందించారు. ఈ సందర్బంగా సీజేఐ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. అందులోని కొన్ని ముఖ్యమైన పాయింట్స్

 

స్నాతకోత్సవంలో సీజేఐ చేతుల మీదుగా విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలు ప్రదానం చేశారు.

విలువలతో కూడిన విద్య అందించే దిశగా వర్సిటీలు ముందుకెళ్లాలి 

విలువలతో కూడిన నైపుణ్యాలతో ప్రపంచాన్నే మార్చే శక్తి వస్తుంది.

పతకాలు అందుకున్న విద్యార్థులకు అభినందనలు 

విద్యార్థి దశలో కీలక దశ ముగించుకుని తర్వాతి దశకు వెళ్తున్నారు.

ఇక్కడ నేర్చుకున్న విలువలను ప్రపంచానికి చాటి చెప్పాలి.

ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకోండి

రామాయణం, మహాభారతంలో నేటికీ వర్తించే ఎన్నో విషయాలు ఉన్నాయి.

నిస్వార్థ సేవా కార్యక్రమాలు నేటి సమాజానికి తక్షణ అవసరం 

మిగిలిన వర్సిటీలతో పోలిస్తే సత్యసాయి వర్సిటీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

 విద్యార్థులపై సత్యసాయిబాబా వాత్సల్యానికి ఈ వర్సిటీ ప్రతీక. ఆధునిక గురుకులాలకు ఇది ఆదర్శ నమూనా.

సత్యసాయి ప్రవచించిన ప్రేమను సమాజానికి, పర్యావరణానికి, భూమాతకు మనం అందించాలి 

Exit mobile version