ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడం తో అధికార పార్టీ నేతలు ఒక్కరు బయటకు వస్తూ.. సీఎం జగన్ (CM Jagan) ఫై తమ ఆగ్రహాన్ని బయటపెడుతూ..పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు వైసీపీ కి గుడ్ బై చెప్పి టీడీపీ , జనసేన పార్టీలలో చేరగా..మరికొంతమంది ఇదే బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు (Puthalapattu MLA MS Babu) తన ఆగ్రహాన్ని బయటపెట్టారు.
గత కొద్దీ రోజులుగా జగన్…నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఫై పరిశీలిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నియోజవర్గాల్లో వ్యతిరేకత ఉన్న నేతలకు టికెట్ ఇవ్వడం లేదు. ఇదే విషయాన్నీ ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ లిస్ట్ లో ఎం.ఎస్. బాబు కూడా ఉన్నారని..ఆయన కూడా ఈసారి టికెట్ రాదనే సంకేతాలు అందుతున్నాయి. ఈ క్రమంలో ఈ వార్తలపై రియాక్ట్ అవుతూ..జగన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
జగన్ చెప్పిన పనులన్నీ చేసినప్పుడు అసంతృప్తి ఉంటే అది తనవల్ల ఎలా అవుతుందని ఆయన నిలదీశారు. తాను ఏం తప్పు చేశానో జగన్ పిలిచి చెప్పాలని ఎంఎస్ బాబు డిమాండ్ చేశారు. తాను జగన్ ను కలిసినప్పుడు వ్యతిరేకత ఉందని తనతో అన్నారని ఎంఎస్ బాబు మీడియాకు తెలిపారు. తనపై వ్యతిరేకత వచ్చిందంటే ఎవరిది బాధ్యత అని ఆయన ప్రశ్నించారు. జగన్ చెప్పినట్లే తాను గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో తిరిగానని ..కనీసం ఐదేళ్ళలో ఒక్కసారి కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడలేదని జగన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపత్తి, చిత్తూరు జిల్లాల్లోని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఓసలను మార్చలేదని, కేవలం దళితుల పట్లనే అన్యాయం జరుగుతుందని బాబు అన్నారు. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే వారికి అన్యాయం జరిగిందని ఎంఎస్ బాబు అన్నారు. తాను చేసిన తప్పేంటో జగన్ చెప్పాల్సిందేనని అన్నారు. ఐ ప్యాక్ సర్వేలను చూపించి వ్యతిరేకత ఉందని చెబుతున్నారని డబ్బులు ఇస్తే ఐఫ్యాక్ వాళ్ళు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారన్నారు. పార్టీలో టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతుందన్నారు. మరి దీనిపై అధిష్టానం ఏమైనా స్పందిస్తుందా..లేదా అనేది చూడాలి.
Read Also : Indrakeeladri : రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ