Site icon HashtagU Telugu

Puthalapattu MLA MS Babu : కాంగ్రెస్ లో చేరిన పూతలపట్టు ఎమ్మెల్యే

Puthalapattu Mla Ms Babu Jo

Puthalapattu Mla Ms Babu Jo

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలోని అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. కొద్దీ నెలలుగా వరుసపెట్టి ఎమ్మెల్యేలు , ఎంపీలు , ZPTC , MPTC ఇలా పైస్థాయి నేతల నుండి గల్లీ నేతలవరకు పార్టీని వీడుతూ వస్తున్నారు. కొంతమంది నేతలు తమకు టికెట్ ఇవ్వలేదనే కోపంతో పార్టీ మారుతుంటే..మరికొంతమంది పార్టీ ఫై నమ్మకం లేక పార్టీని వీడుతున్నారు.

ఇప్పటికే టీడీపీ , జనసేన పార్టీలలో చేరి పలు స్థానాల్లో టికెట్స్ దక్కించుకోగా..ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోకి జోరుగా వలసలు మొదలవుతున్నాయి. వరుసపెట్టి వైసీపీ నేతలు షర్మిల (Sharmila) తో నడిచేందుకు వెళ్తున్నారు. తాజాగా పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు (Puthalapattu MLA MS Babu) శనివారం ఉదయం వైఎస్‌ షర్మిల (Sharmila) సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు షర్మిల కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేను అయిన తనను కాదని.. మరో వ్యక్తికి జగన్ టికెట్‌ కేటాయించడంతో బాబు అసంతృప్తితో గత కొద్దీ రోజులుగా రగిలిపోతున్నారు. ఈ క్రమంలో నేడు కాంగ్రెస్ గూటికి చేరారు. పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంఎస్‌ బాబును ఖరారు చేసే అవకాశం ఉంది.

Read Also : Rs 5 Lakh Per Newborn : ఒక శిశువుకు రూ.5 లక్షల రేటు.. పిల్లలు అమ్మే గ్యాంగ్‌పై సీబీఐ దర్యాప్తు