YS Jagan : జ‌గ‌న్ టార్గెట్ గా పుష్ప‌’, ‘అఖండ‌’

ఇటీవ‌ల విడుద‌లైన `అఖండ‌`, తాజాగా థియేట‌ర్ల‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోన్న `పుష్ప` సినిమా క‌థను ఏపీ చుట్టూ తిప్పారు. ఏపీలోని ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ కథాంశాన్ని అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప లోని హైలెట్ పాయింట్‌.

  • Written By:
  • Publish Date - December 17, 2021 / 02:37 PM IST

ఇటీవ‌ల విడుద‌లైన `అఖండ‌`, తాజాగా థియేట‌ర్ల‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోన్న `పుష్ప` సినిమా క‌థను ఏపీ చుట్టూ తిప్పారు. ఏపీలోని ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ కథాంశాన్ని అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప లోని హైలెట్ పాయింట్‌. కొన్ని ద‌శాబ్దాలుగా ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ జ‌రుగుతోంది. దాన్ని క‌ట్ట‌డీ చేయ‌డంలో ఏపీ ప్ర‌భుత్వాలు వైఫ‌ల్యం చెందుతున్నాయి. ఒకానొక సంద‌ర్భంలో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న టైంలో స్మ‌గ్ల‌ర్ల‌ను ఎన్ కౌంట‌ర్ చేసిన సంఘ‌ట‌న‌పై త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం తీవ్రంగా స్పందించింది. కూలీల‌ను ఏపీ పోలీసులు ఎన్ కౌంట‌ర్ చేయ‌డంపై త‌మిళ‌నాడు ప్రభుత్వం నిర‌సించింది. పైగా ఇటీవ‌ల మ‌ర‌ణించిన జ‌గ‌న్ మామ ఎర్ర‌గంగిరెడ్డి పాత్ర ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ లో ఉంద‌ని టీడీపీ ప‌లుమార్లు ఆరోపించింది. ఏపీలోని ఇలాంటి సీరియ‌స్ స‌బ్జెక్టును తీసుకుని `పుష్ప‌` సినిమాను నిర్మించండం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇక అఖండ సినిమా ఆద్యంతమూ ఏపీలోని పోల‌వ‌రం, రాజ‌ధాని, లోటు బడ్జెట్ తదిత‌ర అంశాల చుట్టూ హీరో బాల‌క్రిష్ణ డైలాగులు న‌డిచాయి. ఏపీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తూ అఖండ సినిమాను నిర్మించారు. అంతేకాదు, కొన్ని డైలాగులు మంత్రుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని రాసిన‌వే. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యేగా బాల‌క్రిష్ణ ఉన్నాడు.ఆయ‌న అభిమానుల‌కు న‌చ్చేలా డైలాగుల‌ను డైరెక్ట‌ర్ బోయ‌పాటి రాశాడ‌ని సినిమా వ‌ర్గాల టాక్‌. ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ కార‌ణంగా ఏపీ ప‌రిస్థితిని తెలియ‌చేస్తూ అఖండ నిర్మాణం జ‌రిగింది. హీరో బాల‌య్య ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఉన్నాడు కాబ‌ట్టి జ‌గ‌న్ ను టార్గెట్ చేస్తూ సినిమాను నిర్మించాడ‌ని స్ప‌ష్టంగా అర్థం అవుతోంది.

`పుష్ప‌` సినిమా కూడా యాదృశ్చికంగా ఏపీలోని ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ ను ఎత్తిచూపుతూ ప‌రోక్షంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసేలా నిర్మించారు. పైగా ఇటీవ‌ల బాల‌య్య `ఆహా` వేదిక‌గా యాంక‌ర్ గా అవ‌తార‌మెత్తాడు. అల్లు ఫ్యామిలీ, నంద‌మూరి కుటుంబం హీరోలు ఇటీవ‌ల ప‌లు వేదిక‌ల‌పై క‌నిపిస్తున్నారు. ప‌ర‌స్ప‌రం అల్లు అర్జున్, హీరో బాల‌య్య‌లు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుకున్నారు. అఖండ వేదిక‌పైన హీరో అల్లు అర్జున్ క‌నిపించాడు. అదే వేదిక‌పైన పుష్ప సినిమా గురించి బాల‌య్య ప్ర‌శంసించాడు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై టాప్ హీరోలు టార్గెట్ చేస్తూ సినిమాలు తీస్తున్నారా? అనే అనుమానం టాలీవుడ్ లో వినిపిస్తోంది.అంతర్జాతీయ మార్కెట్‌లో టన్ను ఎర్ర సాండర్స్ కలప ధర దాదాపు రూ. 1.5 కోట్లు. అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న ప్రధాన పాత్రలలో మరియు ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటించిన పుష్ప చిత్రం క‌థ‌కు మూలం ఎర్ర చంద‌నం. ఆంధ్ర ప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం నుండి ఎర్రచందనం చెట్ల స్మగ్లింగ్ చుట్టూ తిరిగే పాన్ ఇండియా సినిమా అది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ మార్కెట్‌లను షేక్ చేయడానికి ఈ క‌థ‌నాన్ని ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ నుండి కలపను బయటకు తీయడానికి భారీ స్మగ్లింగ్ నెట్‌వర్క్ ఉంది. వాస్తవానికి, ఆంధ్రాలో ఎర్రచందనం చెట్ల సంఖ్య రెండు దశాబ్దాల్లో 50% తగ్గింది.

ఎర్రచందనం దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని అటవీ భూభాగంలో సుమారు 5160 కి.మీ. విస్తీర్ణంలో ఉంది. తమిళనాడు మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో టన్ను రెడ్ సాండర్ కలప ధర దాదాపు రూ. 1.5 కోట్లు, ఎందుకంటే ఆహారపదార్థాలు మరియు ఔషధాల తయారీకి రంగులు వేయడంలో కాకుండా సంగీత వాయిద్యాలు మరియు ఫర్నిచర్ తయారీకి ఇది బాగా డిమాండ్ చేయబడింది. ఇంత‌టి ప్రాధాన్యం ఉన్న ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ ను క‌థాంశంగా తీసుకుని పుష్ప సినిమా నిర్మితం అయింది. అయితే, దీని వెనుక రాజ‌కీయ ప్ర‌యోజ‌నం ఉంద‌ని టాలీవుడ్ టాక్‌.