AP : పొత్తులపై అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి – పురంధేశ్వరి

ఏపీలో పొత్తుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో ఏ పార్టీ ..ఏ పార్టీ తో పొత్తు పెట్టుకుంటుంది..? ఏ నేత ఏ పార్టీ లో చేరబోతున్నారు..? పొత్తుల వల్ల ఎవరికీ టికెట్ దక్కుతుంది..ఎవరికీ దక్కదో ..? అని ఇలా అనేక రకాలుగా రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకొని బరిలో దిగుతుండగా..ఇప్పుడు బిజెపి సైతం ఈ పొత్తు లో భాగం కాబోతున్నట్లు అర్ధం అవుతుంది. […]

Published By: HashtagU Telugu Desk
Purandeswari Say About Alli

Purandeswari Say About Alli

ఏపీలో పొత్తుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో ఏ పార్టీ ..ఏ పార్టీ తో పొత్తు పెట్టుకుంటుంది..? ఏ నేత ఏ పార్టీ లో చేరబోతున్నారు..? పొత్తుల వల్ల ఎవరికీ టికెట్ దక్కుతుంది..ఎవరికీ దక్కదో ..? అని ఇలా అనేక రకాలుగా రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకొని బరిలో దిగుతుండగా..ఇప్పుడు బిజెపి సైతం ఈ పొత్తు లో భాగం కాబోతున్నట్లు అర్ధం అవుతుంది. 2014 లో ఎలాగైతే టీడీపీ- జనసేన – బిజెపి లు కలిసి బరిలోకి దిగాయో…ఇప్పుడు అదే రిపీట్ కాబోతుందని అంత మాట్లాడుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు..ఢిల్లీకి వెళ్లి పలువురు బిజెపి అగ్ర నేతలతో చర్చలు జరిపారు. ఆ తర్వాత అమిత్ షా సైతం పొత్తుల ఫై స్పందించారు. తాము ఎప్పుడూ మిత్ర పక్షాన్ని విస్మరించలేదని ..తామను కాదని వెళ్లిన వాళ్లు మళ్లీ వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే సంచలన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీంతో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులు ఖాయమని అంతా భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సైతం పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. అటు అమిత్ షా చేసిని వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. బీజేపీ ఎదుగుదల కోసమే అమిత్ షా నిర్ణయాలు ఉంటాయని , పొత్తులపై కార్యకర్తల్లో ఎలాంటి గందరగోళం లేదని చెప్పుకొచ్చారు. పార్టీ కోసం కార్యకర్తలందరూ పని చేస్తారని , బీజేపీ అధినాయకత్వం తీసుకున్నఏ నిర్ణయానికైనా తామంతా కట్టుబడి ఉంటామని పురంధేశ్వరి వెల్లడించారు.

Read Also : Hookah Centers : హుక్కా కేంద్రాలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

  Last Updated: 11 Feb 2024, 04:42 PM IST