Site icon HashtagU Telugu

Purandeswari : డ్రగ్స్ కేసుతో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు – పురందేశ్వరి

Purandeswari Drugs

Purandeswari Drugs

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల (Elections 2024) నగారా మోగింది. దీంతో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు , సవాళ్లు ఇలా అనేకం జరుగుతున్నాయి. ప్రజల్లోకి వెళ్లేందుకు..ఒకరిపై ఒకరు బురదజల్లుకోవడం చేస్తుంటారు. ఈ క్రమంలో ఏపీలో డ్రగ్స్ (Visakha Drugs) వ్యవహారం ఫై అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. బ్రెజిల్‌ నుంచి ఆరు రకాల నిషేధిత డ్రగ్స్‌ అవశేషాలతో ‘డ్రైడ్‌ ఈస్ట్‌’ విశాఖ పోర్టుకు దిగుమతి అవ్వడం ఫై ఓ చిన్నపాటి యుద్ధమే నడుస్తుంది. మీదంటే..మీదంటూ అధికార – ప్రతిపక్ష పార్టీలు ఆరోపించుకుంటూ నానా హడావిడి చేస్తున్నాయి.

వైసీపీ నేతలకు చెందిన డ్రగ్స్ డీల్ అని టీడీపీ (TDP) ఆరోపిస్తుండగా… బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి (Purandeswari ) కొడుకు, వియ్యంకుడి ప్రస్తావన తీసుకువస్తూ వైసీపీ (YCP) ఆరోపణలు చేస్తోంది. దీనిపై పురందేశ్వరి స్పందించారు. విశాఖ డ్రగ్స్ కేసుతో తన కుటుంబానికి సంబంధంలేదని ఆమె స్పష్టం చేశారు. తమ కుటుంబంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

గురువారం రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గ సమావేశంలో పురందేశ్వరి మాట్లాడుతూ..రాష్ట్రంలో కూటమి గెలుపు చారిత్రక అవసరం అని నొక్కి చెప్పారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కూటమి అధికారంలోకి రావాలని అన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా విధ్వంసక, అరాచక పాలన చూస్తున్నామని, ఆఖరికి రాష్ట్ర సచివాలయాన్ని కూడా తనఖా పెట్టిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పురందేశ్వరి పిలుపునిచ్చారు. అలాగే విశాఖ డ్రగ్స్ కేసుతో తన కుటుంబానికి సంబంధంలేదని క్లారిటీ ఇచ్చింది.

Read Also : Aditi Rao Hydari-Siddharth: ఏంటి.. అదితి, సిద్దార్థ్ ల పెళ్లి జరగలేదా.. కేవలం ఎంగేజ్మెంట్ జరిగిందా?