రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద జరిగిన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు (Akhanda Godavari Project) శంకుస్థాపన సభలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari ) తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేరు సంబోధిస్తూ “ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి…” అని తడబడి, వెంటనే “డిప్యూటీ సీఎం” అని సరిచేశారు. అయితే ఆమె మాట విన్న వెంటనే పవన్ అభిమానులు హర్షాతిరేకంతో కేకలు వేయడంతో ఆ దృశ్యం వైరల్‌గా మారింది. దీనిని పవన్ కళ్యాణ్ అభిమానులు తెగ షేర్ చేస్తూ భవిష్యత్తు సీఎం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Kanakadurga Temple : ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన వారాహి ఉత్సావాలు..అమ్మవారికి తొలి సారె
ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. “డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అని మేము ముందే చెప్పాం. ప్రజలు మాపై నమ్మకం ఉంచి గెలిపించారు. వికసిత్ భారత్‌లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఒక భాగం అవుతుందని ఆశిస్తున్నాం. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది. ఈ నగరాన్ని హెరిటేజ్ జిల్లా స్థాయికి తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తాను” అని హామీ ఇచ్చారు.
ఈ అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కేంద్ర పర్యాటక శాఖతో కలిసి రాష్ట్ర కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుగా గురువారం ఉదయం అధికారికంగా ప్రారంభమైంది. శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, బీజేపీ ఎంపీ పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా చారిత్రక రాజమహేంద్రవరాన్ని అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రూ.94.44 కోట్ల వ్యయంతో పలు పనులకు శ్రీకారం చుట్టారు.