స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Sevelopment Case)లో ఆరోపణలు ఎదురుకుంటూ రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తో రేపు శుక్రవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి (Purandeswari) ములాఖత్ (Purandeswari Mulakat With Chandrababu) కాబోతున్నట్లు తెలుస్తుంది. పురంధేశ్వరి తో పాటు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ముగ్గురూ కలిసి చంద్రబాబుతో ములాఖత్ అవుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజమో గానీ.. ఈ వార్త ప్రస్తుతం మీడియా లో చక్కర్లు కొడుతుంది.
నిన్న బుధువారం కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) , ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari), తెలంగాణ బిజెపి అధ్యక్షులు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) లు కలవడం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో రెండు రోజులు సీఐడీ విచారణ ఎదుర్కొన్న లోకేశ్ నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లి హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ లో చంద్రబాబు (Chandrababu) కేసుల అంశాన్ని అమిత్ షా తో వివరించడం జరిగింది. ఉద్దేశ పూర్వకంగా కేసులతో వేధిస్తున్నారని ఫిర్యాదు చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
చంద్రబాబు వయసును ప్రస్తావించిన అమిత్ షా ఆయన ఆరోగ్యం పైన వాకబు చేయడం జరిగింది. అయితే, ఈ భేటీ వెనుక బీజేపీ (BJP) ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చొరవ తీసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత 23రోజుల పాటు లోకేశ్ ఢిల్లీలోనే ఉన్నారు. ఆ సమయంలోనే అమిత్ షా తో కలవాలని ప్రయత్నాలు చేసారని చెబుతున్నారు. కానీ, కలవలేకపోయారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందనే ప్రచారం సాగుతున్న వేళ పురందేశ్వరి..ఇదే అంశం పైన బీజేపీ నాయకత్వంతో చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ తరువాత పురందేశ్వరి ట్వీట్ చేయడం జరిగింది. చంద్రబాబు అరెస్ట్ లో బీజేపీ పాత్ర ఉంటే లోకేశ్ తో ఎలా సమావేశం అవుతారని ప్రశ్నించారు.
Read Also : Etela Will Contest Against KCR : కేసీఆర్ ఫై పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన ఈటెల రాజేందర్