Site icon HashtagU Telugu

Purandeswari : ఏపీ చీఫ్ ఎలక్షన్ అధికారికి పురంధేశ్వరి లేఖ..

Purandeswari Say About Alli

Purandeswari Say About Alli

ఏపీ(AP)లో ఎన్నికల (Elections) సమయం దగ్గర పడుతుండడం తో ఏదైనా జరగొచ్చు అనే అనుమానాలు రోజు రోజుకు ఎక్కువుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ (YCP)..ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి దుర్మార్గాలకైనా పాల్పడుతుందని కూటమి నేతలు భావిస్తున్నారు. అందుకే ప్రతి విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పడుతూ..ప్రతి విషయాన్నీ ఈసీకి తెలియజేస్తూ వస్తుంది. ఈ క్రమంలో తాజగా బిజెపి రాష్ట్ర చీఫ్ పురంధేశ్వరి (Purandeswari) ..ఏపీ చీఫ్ ఎలక్షన్ అధికారికి లేఖ రాసారు.

We’re now on WhatsApp. Click to Join.

పలువురు జిల్లా కలెక్టర్లు, బ్యూరోక్రసీలోని కొందరు ఉన్నతాధికారులు వచ్చే రెండు నెలల పాటు దేవాదాయ శాఖ సిబ్బంది సేవలను వినియోగించుకోవద్దని ఏపీ చీఫ్ ఎన్నికల ప్రధాన అధికారికి పురంధేశ్వరి లేఖ రాసారు. సాధారణంగా తమ పరిధిలోని దేవాలయాల్లో రోజువారీ పరిపాలనా విధులు నిర్వర్తిస్తారు.. పరిపాలనలో ఏదైనా అంతరాయం ఏర్పడితే భక్తులకు ఇబ్బందులు తప్పవు.. దేవాదాయ సిబ్బంది నిర్వహించే నిర్దిష్ట విధులను ఆపలేము అని లేఖలో ప్రస్తావించారు. దేవాదాయశాఖల సిబ్బంది సేవలు అనివార్యం.. దేవాదాయ శాఖ సిబ్బందిని ఎన్నికల విధులకు నియమిస్తే హిందూ మతానికి చెందిన వారి సేవలను మాత్రమే వినియోగించుకుంటున్నారని నిరాధార ఆరోపణలు వస్తాయి.. ఏప్రిల్, మే, జూన్ కాలం ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తుంది.. ఉగాది, శ్రీరామనవమి, చందనోత్సవం, నృసింహ జయంతి, బ్రహ్మోత్సవాలు, గ్రామ దేవత వార్షిక వేడుకలు మొదలైన అనేక పండుగలు వస్తాయని ..ఈ పండుగల సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలకు వచ్చే అవకాశం ఉందని.. పురంధేశ్వరి తెలిపారు.

దేవాలయాల్లో యాత్రా సౌకర్యాలను పర్యవేక్షించడానికి సిబ్బంది గణనీయమైన సమయాన్ని వెచ్చించాలి.. ప్రతి జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించడానికి వేలాది మంది ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు.. ఉపాధ్యాయులకు ఇది సెలవు సమయం, దేవాదాయ శాఖ సిబ్బందికి ఇది చాలా బిజీ, పీక్ టైమ్.. దేవాదాయ శాఖ కమిషనర్ కూడా ఈ మేరకు వినతిపత్రం ఇచ్చామని ఆమె చెప్పుకొచ్చారు.

Read Also : YS Vimala : వివేకాను ఎవరు చంపారో వీళ్లే డిసైడ్ చేస్తున్నారుః విమలారెడ్డి మండిపాటు