Site icon HashtagU Telugu

Budameru : బుడమేరు గండి పూడిక పనులను పరిశీలించిన పురందేశ్వరి

Purandeswari Inspected The

Purandeswari

Purandeshwari on Budameru: ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి నేడు (శుక్రవారం) బుడమేరు గండి పూడిక పనులను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బుడమేరు గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయని., గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండ్లు పడ్డాయని ఆరోపించారు. ప్రతి సందర్బంలోనూ రాజకీయం చేయడం కరెక్ట్ కాదని.. రూ. 400 కోట్లతో బుడమేకు కట్ట పటిష్టతకు టీడీపీ పనులు ప్రారంభించిన.. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని కొనసాగించ లేదని ఆమె తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో బుడమేరుకు వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెప్పాలని ఆమె కోరారు.

Read Also: Haryana : హర్యానా ఎన్నికలు..ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య నేడు సీట్ల ఒప్పందం

కాగా, కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రాన్ని వరదల్లో ఆదుకుంటోందని., గురువారంనాడు క్షేత్ర స్థాయిలో కేంద్ర మంత్రి చౌహన్ పర్యటించారని., త్వరలో ఎంత నష్టం వాటిల్లిందో అంచనా వేసి సాయం అందిస్తారని పురందేశ్వరి తెలిపారు. ఇక ఏపీ రాష్ట్ర యంత్రాంగం మొత్తం విజయవాడను కాపాడడానికి శతవిధాల కష్టపడుతున్నారు. ముక్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోనే మక్కాము వేసి అధికారులను సహాయ చర్యలు చేపెట్టేలా విధులు నిర్వహిస్తున్నారు.

మరోవైపు బెజవాడను ముంచెత్తి.. వ‌ర‌ద‌కు కార‌ణ‌మైన బుడ‌మేరు వాగుకు ప‌డిన గండ్లను మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు. రాత్రి తెల్లవారులు దగ్గర ఉండి పనులు చేయిస్తున్నారు. మళ్లీ బుడమేరకు వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో శరవేగంగా గండ్ల పూడుస్తున్నారు. గండ్లు పూడిక పనులను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

Read Also:Telangana: నీటి ప్రాజెక్టుల మరమ్మత్తులకు టెండర్ల ఆహ్వానం