Site icon HashtagU Telugu

Purandeshwari : బిజెపి – టీడీపీ కూటమి భేటీకి పురందేశ్వరి దూరం..ఎందుకో..!!

AP CM

Purandeshwari

త్వరలో జరగబోయే ఎన్నికల్లో జగన్ (CM Jagan) ను గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. గత కొంతకాలంగా దూరంగా ఉన్న టీడీపీ – బిజెపి (TDP-BJP) లు ఇప్పుడు కలుసుకోవడమే కాదు..పొత్తు పెట్టుకొని మరి బరిలోకి దిగబోతున్నాయి. గత మూడు రోజులుగా చంద్రబాబు (CBN) , పవన్ కళ్యాణ్ (Pawan) లు ఢిల్లీ లో మకాం వేసి బిజెపి అగ్ర నేతలతో చర్చలు జరిపి ఎట్టకేలకు బిజెపి ని పొట్టులోకి లాగి బరికి సిద్ధం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు విజయవాడలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించారు. పొత్తును ప్రకటించిన అనంతరం ఈ మూడు పార్టీలు కలిసి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ భేటీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందీశ్వరి (Purandeshwari )తో పాటు కేంద్ర బృందం పాల్గొని సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై చర్చస్తారని అంత అనుకున్నారు. కానీ పురందేశ్వరి ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. పొత్తులో భాగంగా అభ్యర్థులు, సీట్ల సర్దుబాటుపై జరుగుతున్న సమావేశానికి..రాష్ట్ర అధ్యక్షురాలు రాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు నివాసానికి పురందేశ్వరి రాకపోవడంపై బీజేపీ నేతలు సైతం స్పష్టత ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రమంత్రి, కేంద్రస్థాయి నేతలు వచ్చినపుడు ప్రోటోకాల్‌లో భాగంగా వెంట ఉండాల్సిన పురందేశ్వరి ఎందుకు రాలేదు? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ- బీజేపీ పొత్తు కోసం గట్టిగా ప్రయత్నించిన పురందేశ్వరి..తీరా పొత్తు కుదిరిన తర్వాత ఎందుకు దూరంగా ఉన్నారని సందేహం కలుగుతోంది. చంద్రబాబు నివాసం లో సమావేశం ఏర్పాటు చేయడం నచ్చక వెళ్లలేదా..? లేక మరేమైనా కారణం ఉందా అని అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : 8th Indian World Film Festival-2024 : అరుదైన అవార్డు అందుకున్న “హీరో ఆఫ్ ద సీ”

Exit mobile version