Pulivendula : పులివెందులలో టీడీపీ కి భారీ షాక్..వైసీపీ లో చేరిన సతీష్ రెడ్డి

ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు మరింత వేడెక్కుతున్నాయి. అధికార – ప్రతిపక్ష (TDP – Janasena) పార్టీలలో వలసల పర్వం ఉపందుకుంటుంది. ఎవరు..ఎప్పుడు ఏ పార్టీ లో చేరుతున్నారో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. ఉదయం ఓ పార్టీలో ఉన్న నేత..రాత్రికి మరో పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో వారినే నమ్ముకున్న కార్యకర్తలు మద్యంలో ఆగం అవుతున్నారు. ముఖ్యంగా ఇరు పార్టీలు అభ్యర్థుల ప్రకటన చేస్తుండడం తో వరుసపెట్టి నేతలు అటు , ఇటు జంప్ అవుతున్నారు. […]

Published By: HashtagU Telugu Desk
Sateesh Ycp

Sateesh Ycp

ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు మరింత వేడెక్కుతున్నాయి. అధికార – ప్రతిపక్ష (TDP – Janasena) పార్టీలలో వలసల పర్వం ఉపందుకుంటుంది. ఎవరు..ఎప్పుడు ఏ పార్టీ లో చేరుతున్నారో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. ఉదయం ఓ పార్టీలో ఉన్న నేత..రాత్రికి మరో పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో వారినే నమ్ముకున్న కార్యకర్తలు మద్యంలో ఆగం అవుతున్నారు. ముఖ్యంగా ఇరు పార్టీలు అభ్యర్థుల ప్రకటన చేస్తుండడం తో వరుసపెట్టి నేతలు అటు , ఇటు జంప్ అవుతున్నారు.

ఈసారి ఎక్కువగా అధికార పార్టీ నుండి కీలక నేతలు టీడీపీ లో చేరుతుండగా..పులివెందుల(Pulivendula )లో దశాబ్దాలుగా టీడీపీ తరఫున పోటీ చేస్తూ వస్తున్న సతీష్ రెడ్డి (Satish Reddy)..ఇప్పుడు టీడీపీ నుండి వైసీపీ (YCP) లో చేరడం పార్టీ కి భారీ షాక్ తగిలినట్లు అయ్యింది. శుక్రవారం సీఎం జగన్ (CM Jagan) సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇతను మాత్రమే కాదు కాపు నేత హరిరామజోగయ్య కుమారుడు సూర్య ప్రకాశ్ సైతం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ ఎస్వీ సతీష్‌ కుమార్‌ రెడ్డి శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, వైసీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ రామసుబ్బారెడ్డి, కడప మేయర్‌ సురేష్‌బాబు, పలువురు స్ధానిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ప్రాభవం కోల్పోతోందని, ఆయన పెద్ద అవకాశవాదని సతీష్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. టీడీపీని వ్యాపార సంస్థలా లోకేష్ నడుపుతున్నారని ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

 

”27 ఏళ్లు టీడీపీకి పని చేశా. పులివెందులలో టీడీపీ బలోపేతానికి పాటుపడ్డాను. నా కష్టానికి ప్రతిఫలం ఇవ్వకుండా అవమానించారు. నాకు జరిగిన అవమానంతో 2020 లోనే టీడీపీని వదిలి బయటకి వచ్చాను. 27 ఏళ్లు వైఎస్ కుటుంబంతో పోరాటం చేశా, ఇబ్బందులు పెట్టా.. అయినా సీఎం జగన్ పెద్ద మనసుతో నన్ను పార్టీ లోకి ఆహ్వానించారు. నాలుగేళ్లు నన్ను టీడీపీ పట్టించుకోలేదు.. ఇప్పుడు రాయబారం పంపుతున్నారు. చంద్రబాబు పెద్ద అవకాశ వాది.. చంద్రబాబు నాయకత్వం పార్టీలో తగ్గిపోతుంది. నాలాంటి చాలా మంది సీనియర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇకపై జగన్ తో నా ప్రయాణం ఉంటుందని సతీష్ పేర్కొన్నారు. అలాగే జ‌న‌సేన పార్టీ పీఏసీ మెంబ‌ర్ చేగొండి సూర్య‌ప్ర‌కాష్ (Chegondi Suryaprakash) సైతం ఈరోజు జగన్ సమక్షంలో వైసీపీ లో చేరారు.

Read Also : Rameshwaram Cafe Explosion : హైదరాబాద్లో హైఅలర్ట్

  Last Updated: 01 Mar 2024, 07:33 PM IST