Site icon HashtagU Telugu

Pulasa Fish : `పుల‌స`ఖ‌రీదు రూ. 19వేలు, చేప రికార్డ్ ధ‌ర‌

Pulasa Fish

Pulasa Fish

కాకినాడ జిల్లా సమీపంలోని యానాం మార్కెట్‌లో సీఫుడ్‌గా పేరుగాంచిన పులస చేపలకు రికార్డు ధర పలికింది. ఇక్కడి రేవు వద్ద జరిగిన చేపల వేలంలో పార్వతి అనే మహిళ స్థానికంగా చేపల వేలం నిర్వహించగా 2 కిలోల బరువున్న తాజా పులస చేప ఊహించ‌ని రేటు ప‌లికింది. భైరవపాలెంకు చెందిన ఓ వ్యక్తికి రూ.19 వేలకు కొనుగోలు చేయ‌డం విశేషం. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ధర అని స్థానికులు చెబుతున్నారు. ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ దగ్గర ఇసుక రీచ్‌ల కారణంగా గౌతమి కాలువలోకి సముద్రం నుంచి వచ్చే చేపల సంఖ్య తక్కువగా ఉందని మత్స్యకారులు తెలిపారు.

జీవితంలో ఒక్కసారైనా పులస చేపలను తినాలని ప్రజలు నమ్ముతారు. పులస చేపలు దొరకడం చాలా అరుదు కాబట్టి ఎంత ఖర్చయినా వెనక్కి తగ్గరు. వర్షాకాలం వచ్చిందంటే మార్కెట్‌లో ఈ పులస చేపలు దర్శనమివ్వడంతో వాటిని సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. పైగా ఈ పులస చేపలు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని అంతర్వేది, భైరవపాలెం, నరసాపురంలలో ఎక్కువగా లభిస్తాయి. గోదావరి జలాలు సముద్రంలో కలిసే రెండు చోట్ల పులస చేపలు ఎక్కువగా లభిస్తున్నాయని స్థానికులు తెలిపారు.