ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో ఎన్నికలు (Elections) రాబోతున్నప్పటికీ..సీఎం జగన్ (CM Jagan) స్క్రిప్ట్ (Jagan Speech) లో మాత్రం మార్పు రావడం లేదు..ఒకే స్క్రిప్ట్ ను అటుతిప్పి..ఇటు తిప్పి చదువుతున్నాడు తప్ప కొత్తగా ట్రై చేయడం లేదు..పాడిందే పాడరా… పాచిపళ్ళ దాసుడా! అన్నట్లు గత నాలుగేళ్లగా ఒకే పాట పడుతున్నాడు..అది వినివిని రాష్ట్ర ప్రజలకే కాదు..సొంతపార్టీ నేతలకు సైతం విసుగువస్తుంది. ఇంతకీ దీనిగురించా అనుకుంటున్నారా..మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి..జగన్ చెప్పే మాటలు.
గత కొంతకాలంగా జగన్ నోటి వెంట వస్తున్న ఒకే ఒక మాట ప్యాకేజ్ స్టార్..దత్తపుత్రుడు..మ్యారేజ్ స్టార్ (Pawan Kalyan Marriages) ఈ మూడు డైలాగ్స్ తప్ప మరో విమర్శ ఉండదు..అక్కడ అనడానికి కూడా ఏమిలేదు. అందుకే జగన్ ప్రతి సభలోను , సమావేశంలోనూ ఎక్కడ పడితే అక్కడ పవన్ కళ్యాణ్ ను విమర్శించాలంటే ఈ మూడు డైలాగ్స్ మాత్రమే వాడుతుంటాడు. దీనిపై జనసేన శ్రేణులు , నెటిజన్లు , నేతలు ఎన్నోసార్లు చెపుతూనే ఉన్నారు. జగన్ కాస్త కొత్తగా ట్రై చెయ్యి..ఎన్నిసార్లు ఇవే డైలాగ్స్ చెపుతుంటావు..మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా కొచం చూడు..మీ తాత ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడో..మీ పార్టీలో ఎంతమంది ఒక్క పెళ్లి చేసుకొని..బ్యాక్ గ్రౌడ్ లో ఎంతమంది సుకన్యలతో గడుపుతున్నారో చూసుకో అంటూ కామెంట్స్ చేస్తున్నప్పటికీ..జగన్ మాత్రం తన స్క్రిప్ట్ ను మార్చడం లేదు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా ఈరోజు భీమవరం (Bhimavaram) జరిగిన జగనన్న విద్యాదీవెన పథకం కార్యక్రమంలోనూ అదే స్క్రిప్ట్ ను వాడారు. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా..ఏ భార్యతో మూడేళ్లు కాపురం చేయడు మ్యారేజి స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసారు జగన్. రియల్ లైఫ్ లో ఏ భార్యతో మూడు , నాలుగేళ్లయినా కలిసి ఉండడు..చంద్రబాబు తో మాత్రం 10 , 15 ఏళ్లు కాపురం చేయాలనీ అని చెపుతాడు..మ్యారేజ్ స్టార్ ఆడవాళ్లను ఆటవస్తువు గా చూస్తాడు..పెళ్లి సంప్రదాయాన్ని మంటలో కలిపాడు. కార్లను మార్చినట్లుగా ప్రతి రెండేళ్లకు , మూడేళ్లకు భార్యలను మారుస్తాడు..ఇప్పటికే ముగ్గుర్ని మార్చాడు. ఇలాంటి వాళ్ళను నాయకులను చేస్తే మన ఆడబిడ్డల పరిస్థితి ఏంటి..? ఇలాంటి వారికీ ఓటు వేయడం ధర్మమేనా..? ఇలాంటి పెద్ద మనిషి గురించి ప్రజలు ఆలోచించాలని జగన్ చెప్పుకొచ్చారు. నాకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు..ఇదే మాదిరిగా ప్రతి ఒక్కడు చేస్తే మన చెల్లెళ్ళు, అక్కల పరిస్థితి ఏంటో ప్రజలు ఆలోచించాలని కోరారు. భీమవరం ప్రజలు తిరస్కరించిన దత్తపుత్రుడు పక్క తెలంగాణ రాష్ట్రంలో ఉండే నాన్ లోకల్. పక్కవాడు సీఎం కావాలని పార్టీ పెట్టిన వాళ్ళు దేశంలో ఎక్కడ ఉండరు..బాబు సీఎం అవ్వాలని కోరుకుంటూ, ఇష్టం లేని వాళ్ళు వెళ్లిపోవచ్చు అని చెప్పేవారు ఎక్కడ ఉండరని ఎద్దేవా చేశారు.
ఈ వ్యాఖ్యలు విన్న వారంతా మరోసారి జగన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఇక మారవా జగన్..ఎన్నిసార్లు చదివిన స్ర్కిప్టే మళ్లీ మళ్లీ చదువుతావు..పవన్ పెళ్లి కి..రాజకీయాలకు సంబంధం ఏంటి..? మీ తాత రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు కదా..మరి మీ తాత గురించి మాట్లాడవేంటి..? మీ పార్టీ లో నేతలు..నీకు దగ్గరి వారు ఒక పెళ్లి చేసుకొని..ఎంతమందితో తిరుగుతున్నారు..దీని గురించి మాట్లాడవేంటి..? పదే పదే పవన్ కళ్యాణ్ వ్యక్తి గత విషయాలు గురించి మాట్లాడతావు..రాజకీయాలను పర్సనల్ లైఫ్ తో ఎందుకు చూస్తున్నావు..? అని నెటిజన్లు , ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Read Also : Telangana Crimes: 2023లో తెలంగాణలో నేరాలు పెరిగాయి: డీజీపీ రవిగుప్తా