PRP to JSP : మెగా హీరోల ఉప్మా క‌థ‌! APకి మేలా? కీడా?

ప్ర‌జాస్వామ్యంలో ఎన్ని ఎక్కువ పార్టీలు ఉంటే ప్ర‌జ‌ల‌కు అంత మంచిది. కానీ, నాన్ సీరియ‌స్ పార్టీలు (PRP To JSP) వ‌స్తే స‌మాజానికి చేటు.

  • Written By:
  • Updated On - June 23, 2023 / 01:40 PM IST

ప్ర‌జాస్వామ్యంలో ఎన్ని ఎక్కువ పార్టీలు ఉంటే ప్ర‌జ‌ల‌కు అంత మంచిది. కానీ, నాన్ సీరియ‌స్ పార్టీలు (PRP To JSP) వ‌స్తే స‌మాజానికి చేటు. అలాంటి అనుభ‌వాన్ని ఉమ్మ‌డి ఏపీ, విభ‌జిత ఏపీ ఎదుర్కొవ‌డాన్ని అవ‌లోక‌నం చేసుకోవ‌చ్చు. ఉమ్మ‌డి ఏపీలో 2009 ఎన్నిక‌ల‌కు ముందుగా ప్రజారాజ్యం పార్టీని మెగా స్టార్ చిరంజీవి పెట్టారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న పార్టీ కార‌ణంగా టీడీపీ అధికారంలోకి రాలేక‌పోయింది. ప్ర‌తిప‌క్షం హోదాలో ప్ర‌జ‌ల కోసం పోరాడాల్సిన ప్ర‌జారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయింది. ఫ‌లితంగా రాష్ట్రం విడిపోవ‌డానికి కార‌ణం అయింది. ఆ విష‌యాన్ని ఒకానొక సంద‌ర్భంలో చంద్ర‌బాబు చెప్పిన విష‌యం విదిత‌మే.

నాన్ సీరియ‌స్ పార్టీలు స‌మాజానికి చేటు(PRP To JSP) 

రాష్ట్రం విడిపోయిన త‌రువాత 2014 ఎన్నిక‌ల కోసం ప్ర‌జారాజ్యం పార్టీ మ‌రో రూపం జ‌న‌సేన (PRP To JSP) ఆవిర్భ‌వించింది. ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీకి ప‌వ‌న్ మ‌ద్ధ‌తు ప‌లికారు. కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చాయి. ప‌రోక్షంగా ప్ర‌భుత్వాల‌కు మ‌ద్ధ‌తు పలుకుతూ జ‌న‌సేన పార్టీని 2018 ఎన్నిక‌ల‌కు వ‌ర‌కు వ్యూహాత్మ‌కంగా ప‌వ‌న్ బ‌లోపేతం చేశారు. ఆ త‌రువాత చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో పాటు ఉభ‌య క‌మ్యూనిస్ట్ లు, బీఎస్పీతో క‌లిసి జ‌న‌సేన పోటీకి దిగింది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకును సుమారు 6శాతం చీల్చింది. ఫ‌లితంగా 151 స్థానాల్లో వైసీపీ గెలిచింది. రాష్ట్ర రాజ‌ధాని అట‌కెక్కింది.

ప్ర‌జారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం రాష్ట్రం విడిపోవ‌డానికి కార‌ణం 

అదే తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నిక‌ల్లో గెలిచిన‌ట్టైతే, అమ‌రావ‌తి రాజ‌ధాని వెలిగిపోయేది. దాని డిజైన్ గురించి ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మ్యాగ‌జైన్ కూడా ఇటీవ‌ల కొనియాడింది. ప్ర‌పంచ గుర్తింపు పొందడానికి అనువైన రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఉంద‌ని ప్ర‌చురించింది. కానీ, అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాజెక్టును జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూల్చేశారు. మూడు రాజ‌ధానులు అంటూ అభివృద్ధిని ప‌క్క‌న ప‌డేశారు. అప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు వివిధ పారిశ్రామిక‌వేత్త‌ల‌తో కుదుర్చుకున్న ఒప్పందాలు మూల‌న‌ప‌డ్డాయి. ఉపాథి క‌రువైయింది. మ‌రో శ్రీలంక‌, బీహార్ మాదిరిగా ఏపీ ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. దానికి కార‌ణం 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన నాన్ సీరియ‌స్ పాలిటిక్స్ చేయ‌డ‌మేనంటూ  (PRP To JSP)  రాజ‌కీయ పండితుల విశ్లేష‌ణ‌.

జ‌న‌సేన  కార‌ణంగా అమ‌రావ‌తి రాజ‌ధాని కూలిపోయింది

ఇప్ప‌టికైనా ప‌వ‌న్ క‌ల్యాణ్ సీరియ‌స్ పాలిటిక్స్ చేయాలి. మూడుసార్లు ఢిల్లీ సీఎం అయిన కేజ్రీవాల్ ను ఆద‌ర్శంగా తీసుకోవాలి. డ‌బ్బు లేకుండా రాజ‌కీయం చేయాల‌ని ప‌వ‌న్ అనుకోవ‌డం శుభ‌ప‌రిణామం. కానీ, ఎలా చేయాలి అనేది కేజ్రీవాల్ నుంచి నేర్చుకోవాలి. అంతేగానీ, నాస్ సీరియ‌స్ పాలిటిక్స్ చేయ‌డం వ‌ల‌న స‌మాజానికి, రాష్ట్రానికి మేలు కంటే కీడు ఎక్కువ‌గా ఉంటుంది. ఆ విష‌యాన్ని ఉమ్మ‌డి ఏపీ నుంచి ఇప్ప‌టి విడిపోయిన ఏపీ వ‌ర‌కు చూస్తున్నాం. రాష్ట్రం విడిపోవ‌డానికి చిరంజీవి పార్టీ పెట్ట‌డం ఒక కార‌ణ‌మైతే, ఆ పార్టీని విలీనం చేయ‌డం మ‌రో కార‌ణ‌మ‌ని చంద్ర‌బాబు చెప్ప‌డాన్ని కొట్టిపారేయ‌లేం. అలాగే, జ‌న‌సేన పార్టీ పెట్ట‌డం కార‌ణంగా అమ‌రావ‌తి రాజ‌ధాని కూలిపోయింది. రాష్ట్రం మ‌రో శ్రీలంక‌, బీహార్, ఉత్త‌ర కొరియా మాదిరిగా మార‌డానికి జ‌న‌సేన నాన్ సీరియ‌స్ పాలిటిక్స్ గా (PRP To JSP) భావిస్తోన్న ఓట‌ర్లు లేక‌పోలేదు.

Also Read : Janasena Mega plan :`సుఫారీ` సుడులు! ప‌వ‌న్ `హ‌త్య‌కు కుట్ర నిజ‌మా?

ఈ ఇద్ద‌రు హీరోల‌తో పాటు లోక్ స‌త్తా వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ కూడా ఉన్నారు. ఆయ‌న కూడా పార్టీని పెట్ట‌డం ద్వారా ఎమ్మెల్యే మాత్ర‌మే అయ్యారు. కానీ, స‌మాజానికి ఆ పార్టీ వ‌ల‌న క‌లిగిన లాభం కంటే న‌ష్టం ఎక్కువ‌. 2009 ఎన్నిక‌ల్లో ఆ పార్టీ పోటీచేసి ప్ర‌భుత్వ వ్యతిరేక ఓటును చీల్చింది. దీంతో ప్ర‌స్తుతం జ‌న‌సేనాని ప‌వ‌న్ చెప్పిన ఉప్మా క‌థ  (PRP To JSP) మాదిరిగా అయింది. ఫలితంగా రాష్ట్రం విడిపోవ‌డం, విభ‌జిత ఏపీ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మార‌డం జ‌రిగింది. ఒక‌ప్పుడు ఏపీలో ఒక ఎక‌రం అమ్మితే తెలంగాణ‌లో మూడు ఎక‌రాలు వ‌చ్చే ప‌రిస్థితి ఉండేది. ఇప్పుడు. ఒక ఎక‌రం తెలంగాణ‌లో అమ్ముకుంటే ఏపీలో 100 ఎక‌రాలు వ‌స్తుంద‌ని కేసీఆర్ గేలి చేసే దుస్థితికి ఏపీ ఇమేజ్ ప‌డిపోవ‌డానికి నాన్ సీరియ‌స్ పార్టీలు ప్ర‌ధాన కార‌ణం. ఇప్ప‌టికైనా కేజ్రీవాల్ త‌ర‌హాలో సీరియ‌స్ రాజ‌కీయాలు చేయాలా? సినిమాల్లేన‌ప్పుడు ఆట‌విడుపుగా రాజ‌కీయాలు చేయాలా? అనేది ఆలోచించుకోవాలి. లేదంటే ఏపీ రాష్ట్రానికి మంచికంటే చెడు ఎక్కువ‌గా జ‌రుగుతుంద‌ని చెప్ప‌డంలో త‌ప్పులేదు.

Also Read : Pawan Varahi Yatra: ఫ్యాన్స్ కి కిక్కిస్తున్న పవన్ వారాహి యాత్ర