Site icon HashtagU Telugu

Vizag Railway Zone : విశాఖ రైల్వే జోన్ నిర్మాణ కార్యాచ‌ర‌ణ సిద్ధం

It Minister Ashwini Vaishnaw

It Minister Ashwini Vaishnaw

విశాఖ రైల్వే జోన్ నిర్మాణానికి స‌ర్వం సిద్ధం అయింద‌ని కేంద్రం చెబుతోంది. కొత్త రైల్వే జోన్ కార్యాచ‌ర‌ణ వేగవంతం అవుతుంద‌ని వెల్లడించారు. విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే (ఎస్‌సిఓఆర్) జోన్ హెడ్‌క్వార్టర్స్ నిర్మాణానికి వెంటనే భూమి, నిధులు మంజూరు చేస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హామీ ఇచ్చారు. ఎంపీ జీవీఎల్ నరసింహారావు పార్లమెంట్‌లో రైల్వే మంత్రిని కలిశారు. విశాఖపట్నంలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న కొత్త రైల్వే జోన్ కార్యాచరణకు చర్యలు తీసుకోవాల‌ని కోరారు.

కొత్త జోనల్ హెడ్‌క్వార్టర్స్ మరియు ఇతర సంబంధిత కార్యకలాపాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని రాజ్యసభ స‌భ్యుడు జీవీఎల్ కోరిన సంద‌ర్భంగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. రైల్వే మంత్రితో భేటీ అనంతరం ఎంపీ మాట్లాడుతూ కొత్త రైల్వే జోన్‌ను సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఎస్‌సిఒఆర్ జోనల్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేయడానికి , ఇతర కేంద్ర ప్రాజెక్టులను ప్రారంభించడానికి త్వరలో విశాఖపట్నం సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా కోరతానని జీవీఎల్ అన్నారు.ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులలో వైజాగ్ రైల్వే స్టేషన్ రూ. 400 కోట్ల ఆధునీకరణ ప్రాజెక్ట్, IIM మొదటి దశ, విశాఖపట్నం కొత్త అల్ట్రా-మోడర్న్ క్యాంపస్, రూ. 22,000 కోట్ల. HPCL విస్తరణ. ఆధునీకరణ ప్రాజెక్ట్ ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి. క్రూయిజ్ టెర్మినల్, మెగా ఫిషింగ్ త‌దిత‌రాలు ఉన్నాయి. వీటి సంద‌ర్శ‌న కోసం మోడీని తీసుకొస్తాన‌ని జీవీఎల్ అన్నారు.