MLC Anantha Babu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు నిరసన సెగ

‘జగన్ ప్రియ శిష్యుడు, దళితులను చంపి డోర్ డెలివరీ చేసే గంజాయి డాన్ను తరిమికొట్టారు

Published By: HashtagU Telugu Desk
Ananthababu

Ananthababu

ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Anantha Babu)కు నిరసన సెగ ఎదురైంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్తిపాడు అభ్యర్థి వరుపుల సుబ్బారావుకు మద్దతుగా అనంతబాబు, లోక్‌సభ అభ్యర్థి సునీల్‌ ధర్మవరంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ క్రమంలో అనంతబాబు దళితవాడలో తొలుత వైసీపీ(YCP)లోని ఓ వర్గంతో కలిసి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేయడంపై ప్రజలు తీవ్రంగా తప్పుబట్టారు. ఓ ఎస్సీని చంపి దళితల ఆరాధ్య దైవానికి దండ ఎలా వేస్తావంటూ మండిపడ్డారు. ఓట్ల కోసం పూలమాలలు వేయడానికి వస్తావా.? మా దళిత వాడల్లోకి అడుగు పెట్టొద్దంటూ వారంతా హెచ్చరించారు. తక్షణమే వెళ్లకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని అన్నారు. చేసేది లేక అనంతబాబు, ఇద్దరు వైసీపీ నాయకులు వాహనం ఎక్కి అక్కడ నుంచి జారుకున్నారు.

ఈ ఘటన ఫై టీడీపీ (TDP) ట్వీట్ చేసింది. ‘జగన్ ప్రియ శిష్యుడు, దళితులను చంపి డోర్ డెలివరీ చేసే గంజాయి డాన్ను తరిమికొట్టారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి ప్రయత్నించిన వైసీపీ డాన్ను ఊరి బయటకు తరమడంతో అక్కడి నుంచి పారిపోయాడు. జగన్ గుర్తుంచుకో. నీ పతనం చూసేది ఈ దళితులే’ అని టీడీపీ ఓ వీడియోను పోస్ట్ చేసింది.

Read Also : Baba Ramdev : క్షమాపణలు మాకొద్దు.. మీపై చర్యలు తప్పవు.. రాందేవ్ బాబాకు ‘సుప్రీం’ షాక్

  Last Updated: 02 Apr 2024, 01:28 PM IST