Minister Peddireddy : హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి కి నిరసన సెగ

  • Written By:
  • Publish Date - January 10, 2024 / 03:54 PM IST

హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైసీపీ మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ ఎదురైంది. లేపాక్షి మండలం మానెంపల్లిలో తమ ఊరుకు రహదారి వేయడంలేదని మంత్రిని అడ్డుకున్నారు. దీంతో మంత్రి షాక్ అయ్యారు.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు (AP Elections) ముంచుకొస్తుండడంతో అక్కడి రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ…ఈసారి కూడా విజయం సాధించాలని పక్క ప్రణాళికలు రచిస్తోంది. టీడీపీ కంచుకోటల్లో విజయం సాధించి చంద్రబాబు ను కోలుకోలేని దెబ్బ కొట్టాలని జగన్ చూస్తున్నాడు. అందులో భాగంగా టీడీపీ కంచు కోట అయినా హిందూపురం ఫై జగన్ కన్నేశాడు. టీడిపి పార్టీ పెట్టినప్పటి నుంచి అక్కడ ఆ పార్టీదే విజయకేతనం. ఒక్కసారి కూడా మరో పార్టీకి ఛాన్స్ ఇవ్వలేదు అక్కడి ఓటర్లు.. అయితే ఈసారి అక్కడ విజయం సాధించి రికార్డు నెలకొల్పాలని వైసీపీ చూస్తుంది. ఇందులో భాగంగా గత నాల్గు రోజులుగా మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని బాలకృష్ణను రెండుసార్లు ప్రజలు గెలిపించారని, అయితే ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. 99 శాతం మంది లబ్దిదారులకు పథకాలను అందించామని చెప్పారు. అదే సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామని తెలిపారు. హిందూపురంలో ఒక బీసీ మహిళకు సీటు కేటాయించడంతో అందరూ వైసీపీ వైపు చూస్తున్నారన్నారు. రెండుసార్లు తాము గెలవలేకపోయాం కాబట్టి, తప్పొప్పులను బేరీజు వేసుకుని ఇక్కడ బరిలోకి దిగుతామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పార్టీలో నెలకొన్న సమస్యలన్నింటినీ అధిగమించి ముందుకు వెళతామని తెలిపారు.

ఈ తరుణంలో లేపాక్షి మండలం మానెంపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. గౌరిగానిపల్లికి రహదారి వేయడంలేదని మంత్రిని ప్రజలు చుట్టముట్టి నిరసన వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి, ఇన్ ఛార్జి దీపికను చుట్టుముట్టి తమ గ్రామానికి రహదారి కావాలంటూ డిమాండ్ చేశారు. రహదారి నిర్మాణం చేసే విషయం పరిశీలిస్తామని గ్రామస్తులకు మంత్రి పెద్దిరెడ్డి హామీ ఇచ్చారు.

Read Also : KTR : కాంగ్రెస్ పార్టీకి అసలైన సినిమా ముందుంది – కేటీఆర్