తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి (Renigunta Airport) పేరు మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి, రేణిగుంట విమానాశ్రయాన్ని “శ్రీ వేంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయం” (Sri Venkateswara International Airport)గా పిలవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. తిరుమల పవిత్రతకు అనుగుణంగా విమానాశ్రయానికి ఆధ్యాత్మికతను చేర్చాలనే ఉద్దేశంతో టీటీడీ బోర్డు ఈ తీర్మానం చేసినట్లు చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) తెలిపారు. ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభమైంది.
Nara Lokesh : ఢిల్లీకి నారా లోకేష్ ..పూర్తి షెడ్యూల్ ఇదే
అలాగే కర్ణాటక సీఎంల అభ్యర్థన మేరకు బెంగళూరులో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు టీటీడీ సిద్ధమైంది. దీనికోసం 47 ఎకరాల స్థలాన్ని కర్ణాటక ప్రభుత్వం కేటాయించనుంది. మరోవైపు విద్యా రంగంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీలోని టీటీడీ కళాశాల ఆధునీకరణ, కాలేజీల లెక్చరర్ పోస్టుల నియామకం నిలిపివేత, 200 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు వంటి చర్యలు చేపట్టారు. విద్యార్థులకు ధార్మిక-సాంస్కృతిక శిక్షణ ఇవ్వడం కోసం “మన వారసత్వం”, “సద్గమయ” వంటి కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు తెలిపారు.
Starbucks: స్టార్‌బక్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా చాయ్‌వాలా.. అసలు నిజమిదే!
అర్చకుల శిక్షణ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తూ పూజా విధానాలపై శిక్షణను కూడా కలిపేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా అక్షర గోవిందం, హరికథా వైభవం, భగవద్గీత బోధన, భజే శ్రీనివాసం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. జూన్ 21న యోగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం టీటీడీ పరిపాలన భవనంలో నిర్వహించనున్నారు. తిరుచానూరులోని పద్మావతి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా “సౌభాగ్యం” పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.