Nara Lokeshs Promotion: నారా లోకేశ్‌కు త్వరలోనే ప్రమోషన్ లభించబోతోంది. ఆయనను కీలక పదవి వరించబోతోంది. దీనిపై స్వయంగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటన చేయబోతున్నారు. మే 29న కడప జిల్లాలో మహానాడు బహిరంగ సభ వేదికగా ఈ ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. మే 27 నుంచి 29 వరకు టీడీపీ మహానాడు జరుగుతుంది. మహానాడు చివరి రోజున (మే 29న) నిర్వహించే బహిరంగ సభలో టీడీపీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు.
Also Read :KCR Interrogation: ‘కాళేశ్వరం’పై దర్యాప్తు.. కేసీఆర్ విచారణకు సన్నాహాలు
జాతీయ రాజకీయాలపై చంద్రబాబు ఫోకస్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం హోదాలో చంద్రబాబు(Nara Lokeshs Promotion) బిజీగా ఉన్నారు. ఆయన ఏపీ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంపై పూర్తి ఫోకస్ పెట్టారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నో పథకాల ద్వారా సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి నవ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సహకారాన్ని తీసుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఏపీలో జరిగిన కుంభకోణాలను వెలికి తీస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్‌డీఏ కూటమిలో టీడీపీ చక్రం తిప్పుతోంది. దీంతో జాతీయ రాజకీయాలపైనా చంద్రబాబు ఫోకస్ పెట్టాల్సి వస్తోంది. ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ వ్యవహారాలపై లోకేశ్‌కు మరింత పట్టును పెంచాలని చంద్రబాబు భావిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్‌కు ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును కేటాయించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా లోకేశ్‌కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును అప్పగించాలని భావిస్తున్నారట. తద్వారా పార్టీలో నంబర్ 2 స్థాయికి లోకేశ్ చేరుకుంటారు. లోకేశ్‌కు పార్టీలో ప్రమోషన్ గురించి అధికారిక ప్రకటన చేయడానికి కడప మహానాడు కార్యక్రమమే సరైన వేదిక అని చంద్రబాబు అనుకుంటున్నారట.
Also Read :Akash Anand : బీఎస్పీలోకి ఆకాశ్ ఆనంద్ ‘పవర్ ఫుల్’ రీఎంట్రీ.. ఎలా సాధ్యమైంది ?
ప్రభుత్వంలోనూ లోకేశ్‌కు ప్రమోషన్.. ?
నారా లోకేశ్‌కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు డిప్యూటీ సీఎం పోస్టును కూడా ఇవ్వాలని టీడీపీ వర్గాలు చంద్రబాబును కోరుతున్నాయి. తద్వారా పాలనా వ్యవహారాలపైనా లోకేశ్‌కు పట్టు పెరుగుతుందని చెబుతున్నారు. అయితే దీనిపై ఎక్కువగా డిస్కస్ చేయొద్దని పార్టీ క్యాడర్‌కు టీడీపీ పెద్దల నుంచి సూచనలు అందినట్లు తెలుస్తోంది. చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేశే. లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వమని అడిగే స్వేచ్చను కూడా తమకు ఇవ్వకపోతే ఎలా అని కొందరు టీడీపీ నేతలు వాపోతున్నారు. చంద్రబాబు రాజకీయ చాణక్యుడని, సరైన సమయం చూసి ఆయన తప్పకుండా లోకేశ్‌కు ప్రభుత్వంలోనూ ప్రమోషన్ ఇస్తారని మరికొందరు టీడీపీ నేతలు అంటున్నారు. ఏపీలోని కూటమి సర్కారులో భాగంగా ఉన్న అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నాక.. వచ్చే ఎన్నికల నాటికి లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పోస్టును చంద్రబాబు కేటాయిస్తారని చెబుతున్నారు. ఇప్పుడే ఆ పదవిని లోకేశ్‌కు కేటాయిస్తే.. కూటమిలోని పార్టీలతో టీడీపీకి గ్యాప్ పెరిగే ముప్పు ఉందట.