CBN: పబ్లిక్ పాలసితోనే ప్రగతి: చంద్రబాబు

రుద్రారంలోని గీతం వర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం స్టూడెంట్స్ ను ఆకర్షించింది.

  • Written By:
  • Publish Date - May 14, 2023 / 10:42 PM IST

CBN: రుద్రారంలోని గీతం వర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం స్టూడెంట్స్ ను ఆకర్షించింది. ‘విధానాల రూపకల్పన, సంస్కరణలు, పాలనలో టెక్నాలజీ’ అంశంపై ప్రసంగం – పబ్లిక్ పాలసీ గ్రాడ్యుయేషన్ స్నాతకోత్సవానికి మొదటిసారి హాజరయ్యారు. ఆయన ప్రసంగంలోకి ముఖ్య అంశాలు ఇవి

*ప్రజల జీవితాన్ని ప్రభావితం చేయడంలో పబ్లిక్ పాలసీ అనేది చాలా కీలక అంశం
*స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లో అభివృద్ధి రేటు చాలా తక్కువగా ఉండేది –పబ్లిక్ పాలసీ సంస్థకు కౌటిల్య అనే మంచి పేరు పెట్టారు. కౌటిల్యుడి పేరు నిలబెట్టేలా విద్యార్థులు రాణించాలి
*25 ఏళ్ల క్రితం నేను విజన్ 2020 ప్రకటించినప్పుడు కొందరు నవ్వుకున్నారు – కొందరు విజన్ 2020ని విజన్ 420 అంటూ ఎగతాళి చేశారు – నా విజన్ 2020 ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధిలో కనిపిస్తోంది
*ఇప్పుడు విజన్ 2047 గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2047కు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లవుతుంది .

*1978లో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మాకు జీపు ఇచ్చేవారు.అప్పటి రోడ్లలో జీపులు నడిపేందుకు చాలా ఇబ్బందిపడాల్సి వచ్చేది. ఇప్పుడు మీరు న్యూ ఇండియాను చూస్తున్నారు.
* దేశ ప్రగతిని సంస్కరణలకు ముందు.. తర్వాత.. అని చెప్పుకోవాలి. 2047కు మన తలసరి ఆదాయం 26 వేల డాలర్లుగా ఉండాలి.ప్రస్తుతం మనది ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మరో పాతికేళ్లలో మనది ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థ అవుతుంది.
* 2047 నాటికి ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావాలి.యవత తలచుకుంటే 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావడం సాధ్యమే.

* విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు చాలామంది హెచ్చరించారు.విద్యుత్ సంస్కరణల కారణంగా నేను అధికారం కూడా కోల్పోయా. దేశంలో విద్యుత్ సంస్కరణల రూపకల్పనలో నాది కీలకపాత్ర. టెలికమ్యూనికేషన్ల విషయంలోనూ ఎన్నో సంస్కరణలు తెచ్చాం. టెలికమ్యూనికేషన్ల సంస్కరణల ఫలితాలు ఇప్పుడు అంతా అనుభవిస్తున్నారు.
*దేశంలోనే మొదటి హరిత విమానాశ్రయం శంషాబాద్ లో నిర్మించాం.శంషాబాద్ విమానాశ్రయం కోసం 20 ఎయిర్ పోర్టులను స్వయంగా పరిశీలించా *ఐటీ, బీటీ, ఫార్మా వంటి రంగాల్లో ఎంతో ప్రగతి సాధించగలిగామని చంద్రబాబు అన్నారు.