Site icon HashtagU Telugu

TTD : టీటీడీ చైర్మన్ గా నిర్మాత అశ్వినీదత్ ..?

Producer Ashwini Dutt As Tt

Producer Ashwini Dutt As Tt

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరబోతుంది. ఈ నెల 12 న సీఎం గా చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలోని పలు శాఖల్లోని పనిచేస్తున్న వారిపై వేటు వేసేందుకు కొత్త ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఐదేళ్లుగా జగన్ కు కొమ్ముకాస్తూ వస్తున్న అధికారుల పై వేటు వేయాలని బాబు ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే ఆ మేర పనులు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, పలు పదవుల్లో ఉన్న వాళ్ళు రిజైన్ చేస్తుండగా త్వరలోనే కూటమి ప్రభుత్వం తరపున కొత్త వాళ్ళని నియమించేందుకు కసరత్తులు మొదలుపెడుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్ ( TTD Chairman) గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఆ ప్లేస్ లో నిర్మాత అశ్వినీదత్ ను నియమించాలని చంద్రబాబు చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

అశ్వినీదత్ (Producer Ashwini Dutt) ముందు నుంచి కూడా టీడీపీ పార్టీలోనే కొనసాగుతున్నాడు. నందమూరి ఎన్టీఆర్ ఉన్నప్పట్నుంచి ఆ పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తూనే వచ్చారు. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు అరెస్ట్ ని ఖండించి, కూటమి భారీగా గెలుస్తుందని జోస్యం తెలిపారు. చంద్రబాబు ఫ్యామిలీ కి అశ్వినీదత్ ఫ్యామిలీ కి మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో ఆయనకే బాబు మొగ్గుచూపిస్తున్నట్లు అంటున్నారు. అశ్వినీదత్ ఎంపిక పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అడ్డు చెప్పే ప్రసక్తి ఉండదు. మెగా ఫ్యామిలీ కి కూడా అశ్వినీదత్ బాగా దగ్గర. మెగాస్టార్ చిరంజీవి తో పాటు పవన్ కళ్యాణ్ తో కూడా అశ్వినీదత్ సినిమాలు చేయడం జరిగింది. ఇలా అన్ని వైపులా అశ్వినీదత్ సపోర్ట్ ఉండడం తో టీడీటీ చెర్మన్ పదవి ఆయనకే అంటున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సినీ పరిశ్రమ నుంచి దర్శకుడు రాఘవేంద్ర రావు టీటీడీ మెంబర్ గా, టీటీడీ ఆధ్వర్యంలో నడిచే SVBC ఛానల్ కు చైర్మన్ గా కూడా ఉన్నారు. దీంతో అశ్వినీదత్ కు కూడా టీటీడీ చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉండొచ్చు అని భావిస్తున్నారు. చూద్దాం మరి బాబు ఏంచేస్థాడో..!!

Read Also : Rajinikanth : చంద్రబాబు కు శుభాకాంక్షలు తెలియజేసిన సూపర్ స్టార్ రజనీకాంత్