తెలుగుదేశం పార్టీలోని మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావు వియ్యంకులు(Priya Fix TDP) . వాళ్లిద్దరి మధ్యా బంధుత్వం ఉంది. ఇద్దరూ కాపు సామాజికవర్గంకు చెందిన లీడర్లు. రాజకీయాలకు దూరంగా ఉండే నారాయణ మంత్రిగా కావడం వెనుక ఎన్టీఆర్ ట్రస్ట్ కథ ఉంది. దాన్ని అడ్డుపెట్టుకుని నారాయణ చేసిన అరాచకాలను ప్రత్యర్థులు ఎప్పటికప్పుడు బయట పెడుతున్నారు. కానీ, ఎప్పుడూ ఆయన మీద విచారణ జరగలేదు. బ్యాంకులకు కోట్లాది రూపాయాలు ఎగ్గొట్టిన గంటా కూడా సేఫ్ గా ఉన్నారు.
మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావు వియ్యంకులు(Priya Fix TDP)
ఒకే గూటి పక్షులుగా నారాయణ, గంటా ఉన్నారు. అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రుల జాబితాలో ముందుంటారు. సీఆర్డీయేను నడిపించిన మాజీ మంత్రి నారాయణ. అమరావతి ప్రాజెక్టు కోసం కీలక పాత్ర పోషించారు. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధంలేని ఆయన కీ రోల్ పోషించడంపై అప్పట్లో టీడీపీలోని కొందరు కినుక వహించారు. అదే తరహాలో గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉంటూ విశాఖ భూ కుంభకోణంకు పాల్పడ్డారు. ఆ విషయాన్ని అప్పట్లో మరో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు బయట పెట్టారు. ఇద్దరు పరస్పరం ఆరోపణలు చేసుకుని ఆక్రమించిన భూముల భాగోతాన్ని ప్రజాక్షేత్రానికి తీసుకొచ్చారు. ఫలితంగా ఉత్తరాంధ్రలో బలంగా ఉండే టీడీపీని (Priya Fix TDP)భ్రష్టుపట్టించారు.
బ్యాంకులకు భారీగా బకాయిలు పడ్డ గంటా ఎగనామం
ఒక్కో ఎన్నికకు ఒక్కో నియోజకవర్గంలో పోటీ చేసే గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తరం నుంచి గత ఎన్నికల్లో గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోవడంతో చంద్రబాబుకు ఇటీవల దాకా దూరంగా ఉన్నారు. మూడు రాజధానులకు మద్ధతు పలుకుతూ పార్టీకి రాజీనామా కూడా చేశారు. వైసీపీలో చేరడానికి ప్రయత్నం జరిగిందని సర్వత్రా తెలుసు. కానీ, ఆయన వాలకం తెలిసిన జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి తీసుకోలేదు. అంతేకాదు, దగ్గరకు కూడా రానివ్వలేదని ఆ పార్టీ వర్గీయులు చెబుతుంటారు. బ్యాంకులకు భారీగా బకాయిలు పడ్డ గంటా ఎగనామం పెట్టడానికి సిద్దపడ్డారు. ఆ క్రమంలో ఆయన ఆస్తులను వేలం వేయడానికి బ్యాంకులు నోటీసులు కూడా జారీ చేశాయి. నాన్ బెయిలబుల్ వారెంట్ లు. కూడా ఆయన మీద జారీ అయ్యాయి. కానీ, విచారణ సంస్థలు ఆయనకున్న రాజకీయ పలుకుబడిని చూసి మిన్నకుండిపోయాయని (Priya Fix TDP)రాజకీయ సర్కిల్స్ లోని టాక్.
Also Read : TDP vs YCP : పెద్దాపురంలో టెన్షన్.. టెన్షన్.. అవినీతిపై సవాళ్లు చేసుకున్న టీడీపీ – వైసీపీ నేతలు
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారాయణ, గంటా వియ్యంకులు (Priya Fix TDP) అయ్యారు. తొలి నుంచి విద్యా సంస్థలను నడిపిన నారాయణ అనూహ్యంగా సంపాదించారు. అదే సమయంలో ఆయన రాసలీలల వ్యవహారం కూడా అప్పట్లోనే చర్చనీయాంశంగా ఉండేది. బహు భార్యత్వాన్ని కూడా కలిగి ఉన్నాడు. ఆ విషయం ఆ విద్యా సంస్థలోని ఉద్యోగులకు, విద్యార్థులకు కూడా తెలుసు. ఆయన వద్ద చదువును అభ్యసించడానికి వచ్చిన ఒక విద్యార్థిని హస్యంగా వివాహం చేసుకున్నాడని కూడా ఆరోపణ ఉంది. అంతేకాదు, ఆ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులు పలు సందర్భాల్లో నారాయణ రాసలీల (Priya Fix TDP)వ్యవహారం గురించి చర్చించుకోవడం సర్వత్రా తెలిసిందే.
నారాయణ రాసలీల వ్యవహారం ఇప్పుడు మాజీ మంత్రి గంటాకు టచ్
లైంగిక వేధింపులకు పాల్పడడం నారాయణకు కొత్తేమీ కాదని ఆయన గురించి తెలిసిన వాళ్లు చెప్పుకుంటారు. పార్టీలోని ఆయన అనుచరులు కూడా తాజాగా నారాయణ మీద వచ్చిన ఆరోపణలను కొట్టేయలేకపోతున్నారు. ఖండించడానికి ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు. ఆయన కూడా గత వారం రోజులు మరదలు చేస్తోన్న ఆరోపరణలను ఖండించలేదు. తమ్ముడి భార్యను కూడా వదలకుండా వేధించాడని ఆయన మీద వచ్చిన ఆరోపణలు. ఇన్ స్ట్రాగ్రామ్ లో పొంగూరు ప్రియ పెట్టిన వీడియో (Priya Fix TDP) ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, నారాయణ రాసలీల వ్యవహారం ఇప్పుడు మాజీ మంత్రి గంటాకు టచ్ అయింది. మొత్తం ఎపిసోడ్ లో మంత్రి గంటా ప్రమేయాన్ని ప్రియా గుర్తు చేస్తున్నారు.
Also Read : Nellore TDP Incharge : నెల్లూరు రూరల్ టీడీపీ ఇంఛార్జ్‌గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టకు నారాయణ రాసలీల వ్యవహారం భంగం(Priya Fix TDP) కలిగించేలా ఉంది. అంతేకాదు, ఇప్పుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారాన్ని కూడా ప్రియా వెలుగులోకి తీసుకొస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఆరోపణలు కొన్ని ఆ ఇద్దరి మీదా బయటకు వచ్చాయి. కొన్ని వెలుగులోకి రాని అంశాలు కూడా ఉన్నాయని ప్రత్యర్థి పార్టీల లీడర్లు చెబుతున్నారు. ఇప్పుడు ప్రియా రూపంలో నారాయణ, గంటా వ్యవహారం బయటపడుతోంది. ఇప్పటి వరకు పార్టీ పరంగా వాళ్ల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద పూర్వపు గంటా రాజీనామా పత్రం ఉంది. ఇక నారాయణ నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయడానికి సిద్దపడుతోన్న సమయంలో ఈ ఎపిసోడ్ బయట పడింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా ఆ ఇద్దరు మంత్రుల వాలకం మారింది. అధికార వైసీపీ నెల్లూరులో బలహీనపడిన సమయంలో ఈ ఎపిసోడ్ ను హైలైట్ చేసిందని పలువురిలో చర్చ జరుగుతోంది.