Privilege Notice To YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి త్వరలో ప్రివిలేజ్ నోటీసు ఇవ్వనున్నట్లు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రంపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినందుకు గానూ ఆయనతో పాటు ఆయనకు చెందిన మీడియా సంస్థలకు కూడా నోటీసులు అందజేయనున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం రూ.14 లక్షల కోట్ల అప్పుల భారంలో కూరుకుపోయిందన్నారు. గత ప్రభుత్వం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కి సమర్పించిన నివేదికలో కార్పొరేషన్ల ద్వారా పెంచిన అప్పుల ప్రస్తావన లేకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఆ మేరకు అప్పులు చేయలేదని కేవలం గగ్గోలు పెడుతున్న వైఎస్సార్సీపీ నేతలకు దమ్ముంటే అసెంబ్లీలో గానీ, బయట గానీ బహిరంగ చర్చకు రావాలని రామకృష్ణుడు సవాల్ విసిరారు. మీకు ధైర్యం ఉంటే, మీరు అసెంబ్లీలో లేదా వెలుపల రాష్ట్రంలో ఎక్కడైనా బహిరంగ చర్చకు రావచ్చు” అని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ఇప్పుడు ధర్మం అంటూ సిగ్గు లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఓటుకు నోటుపై కనీస అవగాహన లేకుండా జగన్ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. .
రాష్ట్రం ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటే దానికి జగన్ పూర్తి బాధ్యత వహించాలని యనమల రామకృష్ణుడు అన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ కూడా తనను పక్కన పెట్టడంతో నిరాశలో ఉన్న జగన్ కొత్త పొత్తులు వెతుక్కుంటూ ఢిల్లీకి వెళ్లారని అన్నారు. నిధులు ఎలా దోచుకోవాలో వైఎస్‌ఆర్‌సీపీకి తెలుసని, టీడీపీకి ఆదాయాన్ని ఎలా సంపాదించాలో, అభివృద్ధి, సంక్షేమానికి ఎలా ఖర్చు చేయాలో తెలుసునని అన్నారు.
శ్వేతపత్రాల్లో వెలుగులోకి వస్తున్న వాస్తవాలను వైఎస్సార్‌సీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రజలకు వాస్తవాలు తెలిస్తే తమ ఉనికినే కోల్పోతామని భీష్మించుకుంటున్నారని అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఈ అంశాలను తప్పుగా అర్థం చేసుకోవడానికి ఇదే ప్రాథమిక కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా హైదరాబాద్, న్యూఢిల్లీలో మీడియా సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ దౌర్జన్యపూరిత పాలన వల్ల రాష్ట్రంలో పేదరికం పెరిగిపోయిందని, సుస్థిర అభివృద్ధి కూడా అంతంత మాత్రంగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్రంలో ఆర్థిక అసమతుల్యత పెరిగిందని ఆయన అన్నారు. అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టీడీపీ ఎప్పుడూ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Also Read: Thyroid: థైరాయిడ్ సమస్య ఉన్నవారు వీటిని అసలు తీసుకోకూడదట..!