Site icon HashtagU Telugu

Private Travels : ప్ర‌యాణికుల‌కు చుక్క‌లు చూపిస్తున్న ప్ర‌వేట్ ట్రావెల్స్‌.. సంక్రాంతి ర‌ద్దీ పేరుతో దోపిడీ

private travels

private travels

సంక్రాంతి పండుగ‌కు సొంతూళ్ల‌కు వేళ్లే వారిని ప్ర‌వేట్ ట్రావెల్స్ దోపిడీ చేస్తున్నాయి. ప్ర‌యాణికుల‌కు అధిక టికెట్‌ ధరలతో చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ఫ్యామిలీతో కలిసి ఊరెళ్లడం మిడిల్ క్లాస్ కుటుంబాలకు తలకు మించిన భారంగా మారింది. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ప్రధాన నగరాలను కలిపే రూట్లలో టిక్కెట్ ఛార్జీలను గణనీయంగా పెంచాయి. సంక్రాంతి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షల మందికి పైగా ప్రజలు పండుగను జరుపుకోవడానికి సొంతూళ్ల‌కు ప్రయాణ‌మ‌వుతున్నారు. వీరంతా ఆర్టీసీతో పాటు ప్ర‌వేట్ ట్రావెల్స్ ద్వారా ప్ర‌యాణం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఆర్టీసీ, ట్రైన్ టికెట్లు ముంద‌స్తు బుకింగ్‌లు అయిపోవ‌డంతో ప్ర‌వేట్ ట్రావెల్స్ మాత్ర‌మే ఇప్పుడు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ప్ర‌యాణికుల అవ‌స‌రాన్ని ప్ర‌వేట్ ట్రావెల్స్ ఆస‌రాగా చేసుకున్నాయి. హైదరాబాద్-విజయవాడ – తిరుపతి, విశాఖపట్నం, రాజమహేంద్రవరం మరియు నెల్లూరులో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ప్ర‌వేట్ ట్రావెల్స్ ఛార్జీలు పెంచేసింది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రైవేట్ బస్సులు సాధారణంగా రూ. 400 (నాన్-ఎ/సి సీటర్), రూ. 600 (ఎ/సి సీటర్), రూ. 700 (నాన్-ఎ/సి స్లీపర్) మరియు రూ. 870 (ఎ/సి స్లీపర్) , కానీ ఛార్జీలను రూ.1,100, రూ.2,500, రూ.3,000లకు పెంచారు. వీకెండ్‌లో అయితే వీటి ధ‌ర ఇంకా ఎక్కువ ఉన్నాయ‌ని ప్ర‌యాణికులు తెలిపారు. చెన్నై-విజయవాడ రూట్‌లో ఏసీ సీట్లు, స్లీపర్ కోచ్‌ల ధరలు వరుసగా రూ.1,000- రూ.1,800 నుంచి రూ.2,999-4,600కి పెరిగాయి. అధిక ఛార్జీలు వ‌సూళ్లు చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ర‌వాణాశాఖ హెచ్చ‌రించిన ప్ర‌వేట్ ట్రావెల్స్ ఆప‌రేట‌ర్ల తీరు మార‌డం లేదు.

Also Read:  Cock Fight : గోదావ‌రి జిల్లాల్లో సంక్రాంతి కోడి పందాల‌కు సిద్ధ‌మైన బ‌రులు.. భారీగా ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహ‌కులు

Exit mobile version