Site icon HashtagU Telugu

Sankranthi Effect : ట్రిపుల్ చార్జీలు వసూళ్లు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్

Private Travels Ticket Rate

Private Travels Ticket Rate

సంక్రాంతి (Sankranti ) వచ్చిందంటే హైదరాబాద్ (Hyderabad) సగం ఖాళీ అవుతుంది..బ్రతుకుదెరువు కోసం ఎక్కడెక్కడో వారు హైదరాబాద్ నగరానికి వస్తారు..రేయి పగలు కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ పరుగులుపెడుతుంటారు. ఏడాది అంత బిజీ బిజీ గా గడుపుతూ..సంక్రాంతి సమయంలో మాత్రం సొంతర్లకు వెళ్లి కష్టాన్ని మరచిపోయి..కుటుంబ సభ్యులు , బంధువులు , పల్లె వాసులతో హాయిగా గడుపుతుంటారు. ఇందుకోసం నాల్గు రోజుల ముందే సొంతర్లకు బయలుదేరతారు. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి సంబరాలు (AP Sankranthi Sanbaralu) ఎలా జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. అక్కడ జరిగే కోడి పందేలు చూసేందుకు ఇతర రాష్ట్రాల వారు సైతం ఏపీకి పయనం అవుతారు. ప్రస్తుతం అలాంటి సందడే మొదలైంది.

Hair Serum : మీ జుట్టుకు సీరమ్ అప్లై చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి..!

మరో వారం రోజుల్లో సంక్రాంతి సంబరాలు మొదలుకాబోతుండడంతో జనాలంతా సొంతఊర్లకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటీకే ఆర్టీసీ బస్ లు, ట్రైన్స్ ముందస్తు రిజర్వేషన్ తో ఫుల్ అవ్వడం తో ప్రవైట్ ట్రావెల్స్ (Private Travels) వైపు జనాలు చూస్తున్నారు. ఇక ఇదే అదును చేసుకొని చాల ప్రవైట్ ట్రావెల్ సంస్థలు టికెట్ ధరలను అమాంతం పెంచారు. సాధారణ టికెట్ కంటే మూడంతలు పెంచేసేసరికి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మామూలు రోజుల్లో రూ.1500 వరకు ఉండే హైదరాబాద్- వైజాగ్ ప్రైవేట్ బస్సుల AC స్లీపర్ టికెట్ ప్రస్తుతం రూ.5 వేలకు చేరింది. రూ. 1200 వరకు ఉండే హైదరాబాద్ -తిరుపతి టికెట్ రూ. 3 వేలకు చేరింది. ఇక పండగ దగ్గర పడే టైములో ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని చెపుతున్నారు. ఈ టికెట్ ధరలు చూసి సొంతర్లకు వెళ్లాలనుకునే వారు భయపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ దోపిడీని అరికట్టాలని కోరుతున్నారు.