Private buses: ప్రైవేట్ ట్రావెల్స్ ‘‘సంక్రాంతి’’ దోపిడీ.. మూడు రెట్లు అధిక చార్జీలు!

పండుగల సీజన్‌ వచ్చిందంటే చాలు ప్ర‌వేట్ ట్రావెల్స్ యాజ‌మానులు బ‌స్స‌ల్లో ఛార్జీలు పెంచేస్తున్నారు. ప్ర‌వేట్ ట్రావెల్స్ పై ఎలాంటి నియంత్రణ యంత్రాంగం లేకపోవడంతో ఆపరేటర్లు సాధారణ ఛార్జీల కంటే 2-3 రెట్లు అధికంగా ఛార్జీలు వ‌సూళ్లు చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - January 11, 2022 / 01:14 PM IST

పండుగల సీజన్‌ వచ్చిందంటే చాలు ప్ర‌వేట్ ట్రావెల్స్ యాజ‌మానులు బ‌స్స‌ల్లో ఛార్జీలు పెంచేస్తున్నారు. ప్ర‌వేట్ ట్రావెల్స్ పై ఎలాంటి నియంత్రణ యంత్రాంగం లేకపోవడంతో ఆపరేటర్లు సాధారణ ఛార్జీల కంటే 2-3 రెట్లు అధికంగా ఛార్జీలు వ‌సూళ్లు చేస్తున్నారు. సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీ కూడా ప్ర‌త్యేక బ‌స్సుల పేరుతో 50 శాతం ఛార్జీలను పెంచింది. అయితే ప్రైవేటు ట్రావెల్స్‌కు ఆర్టీసీ ఛార్జీల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. తిరుప‌తికి హైదరాబాద్‌తో పాటు పొరుగున ఉన్న చెన్నై, బెంగుళూరు నుండి ఎక్కువ గా బ‌స్సులు న‌డుస్తాయి. చెన్నై, బెంగళూరులో పనిచేస్తున్న చాలా మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సాధారణంగా వారాంతాల్లో ప‌క్క‌నే ఉన్న త‌మ సొంతూళ్ల‌కు వ‌స్తుంటారు. అయితే ప్ర‌తి ఏడాది సంక్రాంతి స‌మ‌యంలో ప్ర‌వేట్ బ‌స్సుల్లో ఛార్జీలు కంటే ఈ ఏడాది సంక్రాంతి పండుగ సమయంలో ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయ‌ని ప్ర‌యాణికులు చెబుతున్నారు. తిరుపతి నుండి హైదరాబాద్‌కు RTC ఛార్జీలు రూ. 774 నుండి 1,230 మధ్య ఉంటాయి. అయితే ప్రైవేట్ ఆపరేటర్లు రూ. 1,000 నుండి 3,000 మధ్య వసూలు చేస్తారు.

అదే విధంగా ఆర్టీసీ సర్వీసుల్లో బెంగళూరుకు రూ. 269 నుండి 620 వరకు ఛార్జీలు ఉంటాయి, అయితే ప్రైవేట్ ఆపరేటర్లు రూ. 500 నుండి 3,000 మరియు అంతకంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు. తిరుపతి-చెన్నై మధ్య ఛార్జీలు కూడా ఇదే ధోరణిని ప్ర‌వేట్ ఆప‌రేట‌ర్లు అవ‌లంభిస్తున్నారు. ఈ పండుగ స‌మ‌యంలో బ‌స్సు ఛార్జీలు సాధారణ టారిఫ్ కంటే 100 శాతానికి పైగా పెంపును చూపుతున్నారు. అయినప్పటికీ చాలా మంది ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అవి కొన్ని అదనపు ఫీచర్‌లతో ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా పిక్-అప్ మరియు డ్రాపింగ్‌లలో మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. హైదరాబాద్‌కు రెండు టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఆపరేటర్ వద్దకు వచ్చిన ఒక ప్రయాణికుడు ఇప్పుడు ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. అయినప్పటికీ అతను హైదరాబాద్ చేరుకోవడానికి ప్ర‌వేట్ బ‌స్సులు సౌకర్యవంతంగా ఉంటున్నాయ‌ని అతను భావించాడు. ఆర్టీసీకి పరిమిత సంఖ్యలో సర్వీసులు మాత్రమే ఉన్నాయని…సమయపాలన సౌకర్యంగా లేదన్నారు.

పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా అధిక మొత్తంలో వసూలు చేసే ప్రైవేట్ ఆపరేటర్లపై నిఘా ఉంచాలని ప్రభుత్వం ఆదేశించిందని తిరుపతి ఆర్టీఓ కె సీతారామిరెడ్డి తెలిపారు. ధరల పెంపునకు చెక్ పెట్టేందుకు త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. ఏదైనా వాహనాలను సీజ్ చేసినపుడు ఇబ్బందులు ఎదురవుతాయని, ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించారు.