Site icon HashtagU Telugu

AP : శనివారం విశాఖలో ప్రధాని బహిరంగసభ…వేదికపై ఆ 8మందికి మాత్రమే చోటు..!!

Modi Meeting

Modi Meeting

ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం మోదీ విశాఖ కు చేరుకుంటారు. ఈస్ట్రన్ నావల్ కమాండ్ లో బస చేస్తారు. శనివారం ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ లో జరిగే సభలో మోదీ ప్రసంగిస్తారు. ఈ సభ నుంచే పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. అయితే మోదీ పాల్గొనే సభ వేదికపై 8 మందికి మాత్రమే అవకాశం కల్పించారు అధికారులు.

ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, సీఎ జగన్, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, ఎంపీలు జీవీఎల్, సీఎం రమేశ్, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీలు పీవీఎన్ మాధవ్, వాకాటి నారాయణరెడ్డిలు ఉంటారు. కార్యక్రమం అనంతరం పలు శంకుస్థాపన కార్యక్రమాలు చేపడతారు. కాగా ఏపీ సీఎం జగన్ ఏడు నిమిషాలు సభపై మాట్లాడతారు. మోదీ దాదాపు 40 నిమిషాలు ప్రసంగించనున్నారు.